విధాత: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం సింహవాహన సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీవారు ధైర్యానికి, శౌర్యానికి ప్రతికయైన సింహవాహనాన్ని అధిష్టించి తిరు మాడ వీధుల్లో భక్తులకు అభయ హస్తంతో దర్శనమిచ్చారు. అర్చక బృందం స్వామివారికి మంగళ హారతి నిచ్చారు. సాయంత్రం ముత్యపు పందిరి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు.