Vastu Tips for Broom | నేడే అమావాస్య‌.. ఇవాళ చీపురు కొంటే లాభ‌మా..? న‌ష్ట‌మా..?

Vastu Tips for Broom | ఇంట్లోకు అవ‌స‌ర‌మ‌య్యే వ‌స్తువుల‌ను కొనేందుకు కూడా వాస్తు నియ‌మాలు( Vastu Tips ) ఉన్నాయి. ఇంటిని నిత్యం శుభ్రం చేసే చీపురు( Broom )ను మాత్రం ఎప్పుడంటే ఎప్పుడు కొన‌కూడ‌దు. మ‌రి ల‌క్ష్మీదేవీ( Lakshmi Devi )కి ప్ర‌తీక‌గా భావించే చీపురును అమావాస్య( Amavasya ) రోజు కొనవ‌చ్చా..? లేదా..? అనే విష‌యాన్ని ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

Vastu Tips for Broom | ఇంట్లో ఆనందం, సంతోషం వెల్లివిరియాలంటే.. ఆ ఇంట వాస్తు నియ‌మాలు( Vastu Tips ) తప్ప‌క పాటించాల్సిందే. మ‌రి ముఖ్యంగా ఆర్థిక స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండాలంటే వాస్తు నియ‌మాలు ఫాలో అవ్వాల్సిందే. అదేంటంటే.. ల‌క్ష్మీదేవీ( Lakshmi Devi )కి ప్ర‌తీక‌గా భావించే చీపురు( Broom ) క‌ట్ట విష‌యంలో త‌ప్పులు చేయ‌కూడ‌ద‌ని వాస్తు పండితులు( Vastu Experts ) చెబుతున్నారు.

ఎందుకంటే చీపురు ఇంటిని శుభ్రం చేసి ఇంట్లోని ప్ర‌తికూల‌త‌ను, చెడును బ‌య‌ట‌కు పార‌ద్రోలుతుంది. చీపురును స‌రిగ్గా వాడితే ఆ ఇంట్లో సిరిసంప‌ద‌లు వెల్లివిరుస్తాయి. సుఖ‌సంతోషాల‌తో వ‌ర్ధిల్లుతారు. అయితే చీపురును త‌ల‌కిందులుగా పెట్టిన‌, తొక్కిన ల‌క్ష్మీదేవి ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌దు. ఆ ఇంట్లో ద‌రిద్రం తాండ‌విస్తుంది. అందుకే ల‌క్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టాల‌న్నా, ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డాల‌న్నా చీపురు విష‌యంలో వాస్తు నియ‌మాలు త‌ప్ప‌క పాటించాల్సిందే.

చీపురును ఏ రోజు కొంటే మంచిది..?

చీపురే క‌దా అని ఏ రోజంటే ఆ రోజు కొనకూడ‌దు. కొత్త చీపురును కేవ‌లం మంగ‌ళ‌, గురు, శుక్ర‌, శ‌నివారాల్లోని కొనాలి. దీపావ‌ళి లేదా ధ‌న త్ర‌యోద‌శి రోజున కొన‌డం మ‌రింత శుభ‌ప్ర‌దం. ఇది ల‌క్ష్మీదేవి అనుగ్రహాన్ని, సంపదను తెస్తుందని, ఆర్థిక సమస్యలను తొలగించి, ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుందని పండితులు చెబుతున్నారు.

అమావాస్య రోజు చీపురు కొనవచ్చా..?

చీపురును అమావాస్య రోజు కూడా కొనవచ్చు.. కానీ.. కృష్ణ పక్షంలో కొంటే మంచిదని పండితులు చెబుతున్నారు. సాధారణ అమావాస్యలలో కొనడం మంచిది కాదు.. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆర్థిక నష్టాలు వస్తాయని పేర్కొంటున్నారు.

ఏ దిశ‌లో చీపురును ఉంచాలి..?

ఇంకా.. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ఇంట్లో సరైన స్థలంలో ఉంచడం కూడా ముఖ్యం. ఇంట్లో చీపురును దక్షిణ భాగం, వాయువ్యం.. లేదంటే పడమర, నైరుతి దిక్కులో ఉంచాలి. అలాగే చీపురును పడుకోబెట్టి ఉంచాలి. ఎవరికీ కనిపించకుండా ఉంచాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, శ్రేయస్సు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

Latest News