Vastu Tips | దంప‌తులు ఒకే కంచంలో క‌లిసి తింటున్నారా..? ముద్దుమురిపెం క‌ష్ట‌మేన‌ట‌..!

Vastu Tips | కొత్త‌గా పెళ్లైన జంట‌లు కావొచ్చు.. చాలా మంది దంప‌తులు( Couples ) కావొచ్చు.. క‌లిసి భోజ‌నం( Meals ) చేసేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. అది కూడా ఒకే కంచంలో క‌లిసి తినేందుకు మ‌క్కువ చూపిస్తారు. కానీ ఇది ప్ర‌మాదం అని వాస్తు పండితులు( Vastu Experts ) హెచ్చ‌రిస్తున్నారు. ఇలా ఒకే ప్లేట్‌లో దంప‌తులు క‌లిసి భోజ‌నం చేయ‌డం వ‌ల్ల దాంప‌త్య జీవితంలో స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని పండితులు పేర్కొంటున్నారు.

Vastu Tips | పూర్వ‌కాలంలో కుటుంబ స‌భ్యులంద‌రూ క‌లిసి ఒకేసారి భోజ‌నం( Meals ) చేసేవారు. దీంతో కుటుంబ బంధాలు బ‌లోపేతం అయ్యేవి. రానురాను ఈ సంప్ర‌దాయం క‌నుమ‌రుగైంది. ఎవ‌రికి ఇష్ట‌మున్న‌ప్పుడు వారు భోజ‌నం చేసి క‌డుపు నింపుకుంటున్నారు. అయితే కొంత మంది దంప‌తులు( Couples ) మాత్రం.. ఇప్ప‌టికీ క‌లిసే భోజ‌నం చేస్తున్నారు. అది కూడా ఒకే కంచంలో భోజ‌నం చేసేందుకు మ‌క్కువ చూపిస్తున్నారు దంప‌తులు. అయితే ఇలా ఒకే ప్లేట్‌లో క‌లిసి భోజ‌నం చేయ‌డం మంచిది కాద‌ని వాస్తు పండితులు( Vastu Experts ) అంటున్నారు. దీని వ‌ల్ల కుటుంబంలో ఆర్థిక స‌మ‌స్య‌లు( Financial Problems ) త‌లెత్త‌డంతో పాటు.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు చోటు చేసుకుంటాయ‌ని పండితులు హెచ్చ‌రిస్తున్నారు.

ఒకే కంచంలో భోజ‌నం.. ఎందుకు వ‌ద్దంటే..?

చాలా మంది దంప‌తులు త‌మ ప్రేమ‌కు చిహ్నంగా ఒకే కంచంలో భోజ‌నం చేసి.. దాంప‌త్య జీవితాన్ని బ‌లోపేతం చేసుకుంటారు. మ‌ధురానుభూతులు పొందుతారు. అయితే ఇది వాస్తు ప్ర‌కారం శుభ‌ప్ర‌దం కాదు. దంప‌తులు ఒకే కంచంలో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల కుటుంబంలోని ఇత‌ర స‌భ్యుల‌కు వీరిపై అసూయ ఏర్ప‌డుతుంది. దీంతో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య వివ‌క్ష ఏర్ప‌డుతుంది. అశాంతి నెల‌కొంటుంది. ఫ‌లితంగా దంప‌తుల సుఖ‌మ‌య జీవితానికి ఎన్నో అవ‌రోధాలు ఏర్ప‌డుతాయి. చివ‌ర‌కు ప్ర‌తికూల శ‌క్తులు పెరిగి ముద్దుముచ్చ‌ట‌కు కూడా దూర‌మ‌వుతార‌ట‌. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

మంచం మీద కూర్చుని తింటున్నారా?

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చాలా మంది టీవీ చూస్తూనో లేదా సోమరితనంతోనో మంచం మీద కూర్చుని భోజనం చేస్తారు. వాస్తు శాస్త్రం దీనిని తీవ్రంగా ఖండిస్తోంది. భోజనాన్ని దేవుని నైవేద్యంగా భావించాలి. నిద్రించే మంచంపై కూర్చుని తినడం అన్నపూర్ణ దేవిని అవమానించినట్లే అవుతుంది. మంచం మీద కూర్చుని తినడం వల్ల ఇంట్లో లక్ష్మీ దేవి నిలవదని, ఇది ఆర్థిక అస్థిరతకు, దారిద్య్రానికి దారితీస్తుందని వాస్తు హెచ్చరిస్తోంది.

Latest News