Vastu Tips | మంచంపై కూర్చొని భోజ‌నం చేస్తున్నారా..? ఆ ప‌నికి ఆటంకం త‌ప్ప‌ద‌ట‌..!

Vastu Tips | చాలా మంది నేల‌పై కూర్చొని భోజ‌నం( Meal ) చేస్తుంటారు. కొంద‌రైతే నేల‌పై కాకుండా డైనింగ్ టేబుల్( Dining Table ) మీద భోజ‌నం చేస్తుంటారు. ఇక కొంద‌రైతే అటు నేల‌, ఇటు డైనింగ్ టేబుల్‌ను వ‌దిలేసి.. ఏకంగా బెడ్రూం( Bedroom )లోని మంచంపై కూర్చొని అన్నం( Meals ) తింటుంటారు. కానీ ఇది ఆ ఇంట్లోని దంప‌తుల( Couples ) జీవితానికి హానీక‌ర‌మ‌ని వాస్తు, జ్యోతిష్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Vastu Tips | ఇంట్లో ఆదాయం( Income ) పెర‌గాల‌న్నా, ఆర్థికంగా నిల‌దొక్కోకోవాల‌న్నా.. వాస్తు, జ్యోతిష్య నియ‌మాలు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని పండితులు చెబుతున్నారు. కానీ చాలా మంది అవేమీ ప‌ట్టించుకోరు. మ‌రి ముఖ్యంగా భోజ‌నం( Meal ) చేసే విష‌యంలో త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. లేదంటే దంప‌తులు( Couples ) చేసే ప్ర‌తి ప‌నిలో ఆటంకం క‌లుగుతుంద‌ట‌. మ‌రి ముఖ్యంగా.. ఆర్థిక న‌ష్టాలు చ‌వి చూడాల్సి వ‌స్తుంద‌ట‌. అప్పులు( Debts ) పెరిగి పోతాయ‌ట‌. రూపాయి కూడా అప్పు చేసే ప‌రిస్థితి వ‌స్తుంద‌ట‌. మ‌రి భోజ‌నం చేసే విష‌యంలో ఎలాంటి నియ‌మాలు పాటించాలో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లంద‌రూ నేల‌పై కూర్చొని భోజ‌నం చేస్తుంటారు. ఇంకా సంప‌న్నులైతే డైనింగ్ టేబుల్‌పై ఆహారం భుజిస్తుంటారు. కానీ కొంద‌రు బ‌ద్ద‌క‌స్తులు ఉంటారు.. నిత్యం బెడ్రూంలోని మంచం మీద‌నే వాలిపోతుంటారు. భోజ‌నం కూడా నిద్రించే బెడ్‌పై చేస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ద‌రిద్రాన్ని ఆహ్వానించిన‌ట్టే అని వాస్తు, జ్యోతిష్య పండితులు హెచ్చ‌రిస్తున్నారు.

వాస్తు ప్రకారం, మంచం మీద కూర్చుని తినడం వల్ల ఇంట్లో పేదరికం( Poverty ) పెరుగుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లి అన్నపూర్ణదేవి ఇది కోపం కలిగిస్తుందని చెబుతున్నారు. అన్నపూర్ణ దేవి కోపం ఇంటి నుండి శ్రేయస్సును నాశనం చేస్తుందని, డబ్బు రాక నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నారు.

మంచం మీద కూర్చుని తినడం వల్ల ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది. దీనివల్ల అనారోగ్యం, తగాదాలు, ఘర్షణలు పెరుగుతాయి. ఇది వాస్తు దోషాలను సృష్టిస్తుంది. ఇది పనికి ఆటంకం కలిగిస్తుంది. పురోగతిలో ఉన్న పని ఆగిపోతుంది. కష్టపడి పనిచేయడం, సామర్థ్యం ఉన్నప్పటికీ పురోగతి సాధించలేము. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల రాహువు దుర్మార్గపు ఫలితాలను కలిగిస్తాడు. మంచి జీవితాన్ని కూడా నరకంగా మారుస్తాడని వాస్తు నిపుణులు, జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.