Calendar | క్యాలెండ‌ర్‌తో భార్యాభ‌ర్త‌ల బంధం బలోపేతం..? ఇది ఎంత వ‌ర‌కు నిజం..!

Calendar | ప్ర‌తి ఇంట్లో క్యాలెండ‌ర్( Calendar )ఉంటుంది.. కానీ దాన్ని వాస్తు నియ‌మాల‌కు( Vastu Tips ) అనుగుణంగా ఉంచ‌రు. ఏ దిశ‌లో అంటే ఆ దిశ‌లో వేలాడ‌దీస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల దంప‌తుల( Couples ) మ‌ధ్య క‌ల‌హాలు ఏర్ప‌డుతాయ‌ట‌. మ‌రి భార్యాభ‌ర్త‌ల( Husband and Wife ) మ‌ధ్య బంధం బ‌లోపేతం కోసం ఏ దిశ‌లో క్యాలెండ‌ర్ వేలాడ‌దీయాలో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

Calendar | క్యాలెండ‌ర్‌తో భార్యాభ‌ర్త‌ల బంధం బ‌లోపేతం ఏంట‌ని మీకు ఆశ్చ‌ర్యంగా ఉండొచ్చు. కానీ ఇది అక్ష‌రాల నిజం. ఎందుకంటే.. క్యాలెండ‌ర్( Calendar ) విష‌యంలో వాస్తు నియ‌మాలు( Vastu Tips ) పాటిస్తే.. ఆ ఇంటి దంపతుల( Couples ) బంధం బలోపేతం కావ‌డ‌మే కాదు.. నిత్యం ఇరువురి మ‌ధ్య ప్రేమానురాగాలు( Love ) వెల్లివిరుస్తాయ‌ని వాస్తు పండితులు( Vastu Experts ) చెబుతున్నారు. సుఖ‌సంతోషాలతో మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా వ‌ర్ధిల్లుతార‌ట‌.

అయితే క్యాలెండ‌ర్‌ను గోడ‌కు వేలాడ‌దీసే విష‌యంలో వాస్తు నియ‌మాలు పాటించాల‌ని పండితులు సూచిస్తున్నారు. ఈ క్యాలెండ‌ర్‌కు ఇంట్లోకి సానుకూల శ‌క్తిని ప్ర‌సరింప‌జేసే సామ‌ర్థ్యం ఉంద‌ట‌. అందుకే స‌రైన దిశ‌లో క్యాలెండ‌ర్‌ను వేలాడ‌దీయ‌క‌పోతే ప్ర‌తికూల శ‌క్తి పెరిగి, దంపతుల మ‌ధ్య క‌ల‌హాల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ట‌. అంతేకాదు ఆ ఇంట ఆర్థిక సంక్షోభం ఏర్ప‌డి.. చేసే ప్ర‌తి ప‌నిలోనూ ఆటంకాలు ఎదుర‌వుతాయ‌ట‌. కాబ‌ట్టి క్యాలెండ‌ర్‌ను ఇంట్లో ఏ దిశ‌లో వేలాడదీస్తే మంచి జ‌రుగుతుందో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

తూర్పు దిశ‌ ( East )

ఇంటికి తూర్పు ముఖంగా ఉన్న గోడ‌పై క్యాలెండ‌ర్‌ను వేలాడ‌దీయం వ‌ల్ల‌.. ఆ ఇంట్లో పురోగతి ఉంటుంద‌ట‌. జీవితంలో గొప్ప‌గా ఎదుగుతార‌ట‌. విజ‌యాలు వరిస్తాయ‌ట‌. ఇక సూర్యోద‌యం వంటి చిత్రాలు ఉన్న క్యాలెండ‌ర్ ఉంటే.. సానుకూల శ‌క్తి మ‌రింత రెట్టింపు అవుతుంద‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ఉత్త‌ర దిశ‌ ( North )

ఇక ఉత్త‌ర దిశ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే ఉత్త‌ర దిశ‌ను కుబేరుడి స్థానంగా భావిస్తారు. కాబ‌ట్టి ఈ దిశ‌లో క్యాలెండ‌ర్‌ను వేలాడ‌దీయడం వ‌ల్ల ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంద‌ట‌. కొత్త ఆదాయ మార్గాల‌కు బాట‌లు వేస్తుంద‌ట‌. వృత్తిప‌రంగా గొప్ప స్థానాల‌కు ఎదుగుతార‌ని పండితులు పేర్కొంటున్నారు.

ఈశాన్యం ( Northeast )

ఇంట్లో గొడవలు లేకుండా, ప్రశాంతత నెలకొనాలంటే ఈశాన్య మూల ఉత్తమం. ఆధ్యాత్మిక చింతన, ధ్యానం, దైవ భక్తిని ప్రతిబింబించే చిత్రాలు ఉన్న క్యాలెండర్లను ఇక్కడ ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంద‌ట‌.

నైరుతి ( Southwest )

నైరుతి దిశ‌లో క్యాలెండ‌ర్ ఉండ‌డం వ‌ల్ల కుటుం స‌భ్యుల మ‌ధ్య‌నే కాదు.. మ‌రి ముఖ్యంగా దంప‌తుల మ‌ధ్య బంధాలు బ‌లోపేతం అవుతాయ‌ట‌. ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయ‌ట‌. కుటుంబ చిత్రాలు లేదా ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు ఉన్న క్యాలెండర్లు ఇక్కడ ఉంచితే కుటుంబంలో ఐక్యత పెరుగుతుంద‌ట‌.

 

Latest News