Infant Murder | 4 నెల‌ల ప‌సికందును చంపేసిన తండ్రి.. ఆపై ఆత్మ‌హ‌త్య‌

Infant Murder | భార్యాభ‌ర్త‌ల( Couples ) మ‌ధ్య చోటు చేసుకున్న స్వ‌ల్ప వివాదం.. ఓ ప‌సిబిడ్డ( Infant ) ప్రాణాల మీద‌కు తెచ్చింది. బిడ్డ‌ను చంపి తండ్రి( Father ) కూడా ఆత్మ‌హ‌త్య( Suicide ) చేసుకున్నాడు.

Infant Murder | ముంబై : కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన తండ్రే) Father ) ఓ ప‌సికందును( Infant ) చంపేశాడు. ఓ నీటి డ్ర‌మ్ముల్లో చిన్నారిని ముంచి ప్రాణాలు తీశాడు. ఆ త‌ర్వాత తాను ఆత్మ‌హ‌త్య( Suicide ) చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర) Maharashtra ) బీద్ జిల్లాలోని త‌ల్వాడా గ్రామంలో వెలుగు చూసింది.

త‌ల్వాడా గ్రామానికి చెందిన అమోల్ సోన‌వానేకు కొన్నేండ్ల క్రితం వివాహ‌మైంది. ఈ దంప‌తుల‌కు నాలుగు నెల‌ల క్రితం పండంటి మ‌గ‌బిడ్డ జ‌న్మించాడు. అయితే కొద్ది రోజుల క్రితం భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య స్వ‌ల్ప వివాదం చోటు చేసుకుంది. ఆ స‌మ‌యంలో దంప‌తులిద్ద‌రూ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. కుటుంబ స‌భ్యులు గ‌మ‌నించి వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అనంత‌రం వారిని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేశారు.

మ‌ళ్లీ ఏమైందో తెలియ‌దు కానీ.. శ‌నివారం నాడు త‌న నాలుగు నెల‌ల ప‌సిబిడ్డ‌ను నీటి డ్ర‌మ్ములో ముంచి హ‌త్య చేశాడు. అనంత‌రం తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Exit mobile version