Numerology | ఈ నాలుగు తేదీల్లో జన్మించిన మహిళలతో జర జాగ్రత్త..! భర్తలను ఆడిస్తారట..!!
Numerology | సాధారణంగానే మహిళలు భర్తలను ఆడిస్తారు. ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు కొంత మంది మహిళల వ్యవహార శైలి ఉంటుంది. కట్టుకున్న మొగుడిని అసలే లెక్క చేయరు. మరి ముఖ్యంగా ఈ నాలుగు తేదీల్లో జన్మించిన మహిళలు అయితే... తమ భర్తలను ఓ రేంజ్‌లో ఆడిస్తారట. మరి ఆ నాలుగు తేదీల్లో ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
Numerology | జ్యోతిష్య శాస్త్రంలో న్యూమరాలజీ ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రతి అంకెకు ప్రత్యేకత ఉంటుంది. అయితే కొన్ని తేదీల్లో జన్మించిన వారు ప్రత్యేక స్వభావాలను కలిగి ఉంటారు. ఇది ముఖ్యంగా మహిళల్లో కనబడుతుంది. ఈ నాలుగు తేదీల్లో జన్మించిన మహిళలు తమ భర్తలను ఆడిస్తారట. తమ కొంగు చుట్టుతా తిరిగేలా చేసుకుంటారట. భర్తలను హింసిస్తూ పైశాచిక ఆనందం పొందుతారట. మరి ఆ నాలుగు తేదీల్లో ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
5వ తేదీ
న్యూమరాలజీ ప్రకారం.. 5వ తేదీన జన్మించిన మహిళలు చాలా మొండి స్వభావాన్ని కలిగి ఉంటారట. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆరాట పడుతుంటారట. ఇంటా బయటా తమదే పై చేయి ఉండాలని తాపత్రయం చెందుతారట. మరి ముఖ్యంగా మొగుడి వద్ద తమ పెత్తనం నడవాలని కోరుకుంటారట. మొత్తానికి భర్తను ఓ రేంజ్‌లో ఆడిస్తారట.
14వ తేదీ
ఇక 14వ తేదీన పుట్టిన అమ్మాయిలు కూడా దూకుడు స్వభావంతో ఉంటారట. ఇంటా, బయటా ధైర్యంగా ఉంటూ ప్రతి సమస్యను ఎదుర్కొంటారట. కానీ భర్త మాట అసలే వినరట. తమకు నచ్చిందే చేస్తారట. తాము అనుకున్నది సాధించుకునేందుకు మొగుడితో అన్ని పనులు చేయించుకుని, హింసిస్తారట.
24వ తేదీ
24వ తేదీన జన్మించిన మహిళలు చాలా తెలివితో ప్రవర్తిస్తారట. సృజనాత్మకతో తమ భర్తలను తమ మాయలో వేసుకుంటారట. తమ మొగుళ్ల మాట వినట్టే విని.. అదుపులో పెట్టుకోవడంలో ఆరితేరిన వారట. ఉన్నతస్థితిలో ఉండాలనే కోరికతో భర్తలను ఇబ్బందులను గురి చేస్తారట.
29వ తేదీ
29వ తేదీలో పురుడు పోసుకున్న అమ్మాయిలు కూడా మంచి వ్యక్తిత్వంతో ఉంటారట. కానీ భర్తను చూసే సరికి ఓ ఆట ఆడుకుంటారట. ఇంటా బయటా తమ పెత్తనమే నడవాలని కోరుకుంటారట. భర్తను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని.. ఆడిస్తారట.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram