Karthika Amavasya | రేపే కార్తీక అమావాస్య.. భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదట..!
Karthika Amavasya | రేపే కార్తీక అమావాస్య( Karthika Amavasya ). ఈ అమావాస్య రోజున శుభకార్యాలతో పాటు కొన్ని పనులు నిర్వహించకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు మరి ముఖ్యంగా భార్యాభర్తలు( Couples ) శారరీకంగా కలవకూడదని, ఒక వేళ పొరపాటున కలిస్తే వారి దాంపత్య జీవితం( Couple Life )లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతున్నారు.
Karthika Amavasya | ప్రతి పక్షం రోజులకు అమావాస్య( Amavasya ), పౌర్ణమి( Purnima ) రావడం సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో వచ్చే అమావాస్య, పౌర్ణమిలకు హిందూ సంప్రదాయంలో చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ క్రమంలోనే కార్తీక మాసం( Karthika Masam )లో వచ్చే అమావాస్య ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ నెల 20వ తేదీన ఏర్పడే కార్తీక అమావాస్య రోజున ఈ పనులు చేయకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. లేదంటే జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా అదొక్క రోజు భార్యాభర్తలు( Couples ) శారీరకంగా కలవకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు పండితులు. కార్తీక అమావాస్య రోజున ఏ పనులు చేయాలి..? ఏ పనులు చేయకూడదో ఈ కథనంలో తెలుసుకుందాం..
శుభకార్యాలు నిర్వహించకూడదు..!
సాధారణంగానే అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యాలు చేపట్టరు. చిన్న చిన్న పనుల నుంచి మొదలుకొని వివాహా కార్యక్రమాల వరకు ఎలాంటి పనులు ప్రారంభించరు. కాబట్టి శుభకార్యాలు వాయిదా వేస్తే బెటర్. లేదు మొండిగా వెళ్లి శుభకార్యాలు తలపెడితే.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు.
కొత్త వస్తువులు కొనుగోలు చేయకూడదు..!
అమావాస్య రోజున కొత్త వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా కొత్త దుస్తులు, కొత్త వాహనాలు కొనకపోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.
కటింగ్, గోళ్లు కత్తిరించకూడదు..!
ఎట్టి పరస్థితుల్లో కటింగ్, షేవింగ్, గోళ్లు కత్తిరించుకోవడం లాంటివి అమావాస్య రోజు చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు.
భార్యాభర్తలు శృంగారానికి దూరంగా ఉండాలి..!
అలాగే అమావాస్య రోజున భార్యభర్తలు శారీరకంగా కలవడం వాళ్ళ ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో సృష్టి కార్యంలో పాల్గొనడం వల్ల సంతాన సమస్యలతో పాటు ఆలుమగల మధ్య ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు పండితులు.
ప్రయాణాలు కూడా వాయిదా వేస్తే మంచిది..!
అమావాస్య రోజు వీలైనంత వరకు ప్రయాణాలు చేయకూడదన్నది పెద్దల మాట. అమావాస్య రోజు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నమ్ముతారు. మరీ ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram