T20 CWC 2026 – India Semis Chances | సూపర్​ 8 మ్యాచ్​లో పరాజయం – భారత్​ సెమీఫైనల్​ అవకాశాలు ఎలా ఉన్నాయి?

దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల ఓటమి తర్వాత టి20 ప్రపంచకప్​లో భారత్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. తనకు మిగిలిన 2 మ్యాచ్‌లతో పాటు భారత్‌కు ఇంకా ఏ సమీకరణాలు సెమీస్​కు చేర్చగలవో విశ్లేషణ.

  • By: ADHARVA |    sports |    Published on : Feb 23, 2026 12:29 AM IST
T20 CWC 2026 – India Semis Chances | సూపర్​ 8 మ్యాచ్​లో పరాజయం – భారత్​ సెమీఫైనల్​ అవకాశాలు ఎలా ఉన్నాయి?

T20 World Cup 2026 Semifinal Scenario: What India’s Loss to South Africa Means

76 పరుగుల పరాజయం  |  –3.8 నెట్ రన్‌రేట్  |  ఇక రెండు మ్యాచ్‌లు ‘డూ ఆర్ డై’

 

విధాత క్రీడా విభాగం | 22 ఫిబ్రవరి 2026 | హైదరాబాద్:

ICC Men’s T20 World Cup సూపర్–8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ ఓటమి భారత్ సెమీఫైనల్ అవకాశాలకు గట్టిగా దెబ్బతీసింది. అహ్మదాబాద్‌లోని Narendra Modi Stadiumలో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 63, డివాల్డ్ బ్రెవిస్ 45 పరుగులతో రాణించగా, భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా 3/15తో రికార్డు సృష్టించాడు.

188 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ 111 పరుగులకే కుప్పకూలింది. మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.

ఈ ఫలితంతో భారత్‌కు సెమీఫైనల్​ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లు కీలకంగా మారాయి. ఇప్పుడు భారత్​ సెమీస్​ చేరుకోవడానికి ఉన్న మార్గాలు పరిశీలిద్దాం.

ALSO READ: టి20 ప్రపంచ కప్​ సూపర్​ 8 :  దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం

సెమీఫైనల్ సమీకరణాలు ఇలా ఉన్నాయి..

పరిస్థితి 1: భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే.?

భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లను (వెస్టిండీస్, జింబాబ్వే పై) గెలిస్తే 4 పాయింట్లు సాధిస్తుంది. సాధారణంగా ఇది సెమీఫైనల్‌కు సరిపోతుంది.

అయితే మరో రెండు జట్లు కూడా 4 పాయింట్లు సాధిస్తే అప్పుడు నెట్ రన్‌రేట్ (NRR) కీలకం అవుతుంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి, వెస్టిండీస్–జింబాబ్వేల మ్యాచ్​  విజేత కూడా దక్షిణాఫ్రికాను ఓడిస్తే సమీకరణాలు క్లిష్టమవుతాయి.

పరిస్థితి 2: భారత్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే..?

భారత్ ఒకే మ్యాచ్ గెలిస్తే పరిస్థితి మరింత సంక్లిష్టం.

ఈ పరిస్థితిలో దక్షిణాఫ్రికా తమ మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవాలి. అలాగే భారత్ వెస్టిండీస్–జింబాబ్వే మ్యాచ్​ విజేతపై విజయం సాధించాలి. అప్పుడు భారత్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లకు తలా రెండేసి పాయింట్లు ఉంటాయి.

ఇక్కడ కూడా అర్హత పూర్తిగా నెట్ రన్‌రేట్‌పైనే ఆధారపడి ఉంటుంది.

మిగిలిన మ్యాచ్‌లు

  • ఫిబ్రవరి 23: వెస్టిండీస్ vs జింబాబ్వే (ముంబై)
  • ఫిబ్రవరి 26: దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ (అహ్మదాబాద్)
  • ఫిబ్రవరి 26: భారత్ vs జింబాబ్వే (చెన్నై)
  • మార్చి 1: దక్షిణాఫ్రికా vs జింబాబ్వే (ఢిల్లీ)
  • మార్చి 1: భారత్ vs వెస్టిండీస్ (కోల్కతా)

భారత్‌కు మార్గం ఇంకా పూర్తిగా మూసుకుపోలేదు. కానీ పరిస్థితి కఠినమైంది. ఇకపై ప్రతి మ్యాచ్ భారీ తేడాతో గెలవాల్సిందే. ముఖ్యంగా నెట్ రన్‌రేట్ మెరుగుపరచుకోవడం అత్యవసరం.

రేసులో భారత్ నిలబడాలంటే —తప్పనిసరి సమీకరణం
రెండు విజయాలు + భారీ నెట్ రన్‌రేట్ = సెమీఫైనల్