Vastu Tips | చాలా మంది రూపాయి నాణెం( One Rupee Coin )ను తక్కువ అంచనా వేస్తుంటారు. కానీ రూపాయి నాణెమే ఇప్పుడు మీ ఆర్థిక సమస్యలకు( Financial Problems ) పరిష్కారం కానుంది. ఈ ఒక్క పని ప్రతి రోజు రాత్రి వేళ చేస్తే మీ అప్పులన్నీ( Debts ) మాయమవుతాయని వాస్తు పండితులు( Vastu Experts ) చెబుతున్నారు.
ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి..
అదేంటంటే.. ప్రతి ఒక్కరూ కూడా తమ మొబైల్స్( Mobiles )ను దిండు కింద లేదా పక్కకు పెట్టి నిద్రిస్తుంటారు. ఆ మొబైల్ ఫోన్‌కు బదులుగా రూపాయి నాణెంను దిండు కింద పెట్టుకుని నిద్రిస్తే.. మనలో నెగెటివ్ ఎనర్జీ పోతుందట. దుష్ట శక్తుల పీడ నుంచి విముక్తి పొంది.. పాజిటివ్ ఎనర్జీ( Positive Energy ) మన శరీరంలోకి ప్రవేశిస్తుందట. అంతేకాకుండా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి.. ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో వర్ధిల్లుతారట.
అనారోగ్య సమస్యలు దూరం
దిండు కింద రూపాయి నాణెం పెట్టుకుని నిద్రించడం వల్ల అనారోగ్య సమస్యలు( Health Issues ) అనేవి దూరం అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా దూరమై.. ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ఇలా చేయడం వల్ల డబ్బు పరంగా ఉన్న చిక్కులు కూడా దూరమవుతాయి.
ఇలా చేస్తే ధనలాభం
ఈ రెమిడీని ప్రతీ నెలా ఒక్కసారి చేయవచ్చు. రాత్రి పూట నిద్రపోయేటప్పుడు దిండు కింద రూపాయి నాణెం పెట్టుకుని నిద్రించాలి. తరువాతి రోజు ఆ నాణెంను పారే నది, చెరువు వంటి వాటిల్లో వదిలేయవచ్చు. ఇలా చేస్తే ధనలాభం కలుగుతుందని అంటున్నారు పండితులు.
