Vastu Tips | ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలకు( Vastu Tips ) అనుగుణంగా తమ ఇంటిని నిర్మించుకుంటారు. ఇక అలాంటి ఇంట్లో చెప్పుల స్టాండ్ నుంచి మొదలుకుంటే నిద్రించే బెడ్ వరకు ప్రతి వస్తువు విషయంలో వాస్తు నియమాలను పాటిస్తుంటారు. ప్రధానంగా మనం భోజనం చేసే డైనింగ్ టేబుల్( Dining Table ) విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు( Vastu Experts ) హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఇంట్లోని సభ్యులు భారీగా నష్టాలు చవిచూసే అవకాశం ఉందట. అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం..
వాస్తు నియమాల ప్రకారం.. డైనింగ్ టేబుల్( Dining Table )కు కూడా ఒక దిశ ఉంది. పశ్చిమం, వాయువ్యం, ఈశాన్యం దిశలో మాత్రమే డైనింగ్ టేబుల్‌ను ఏర్పాటు చేసుకోవాలట. తూర్పు దిశలో డైనింగ్ టేబుల్ ఉంచడం కారణంగా ఆ ఇంట్లోని సభ్యులకు నష్టాల బారిన పడుతారట. ఈ దిశలో డైనింగ్ టేబుల్ ఉంచి తింటే.. రుచికరమైన ఆహార పదార్ధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారట.
ఇక తూర్పు – ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల తినాలనే కోరిక కూడా తగ్గిపోతుందట. నైరుతి దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఆహారం తినేందుకు పెద్దగా ఇష్టపడరట. డైనింగ్ టేబుల్‌ను ఎప్పుడూ ప్రవేశ ద్వారం ముందు ఉంచవద్దు. అలా చేయడం వల్ల ఇంట్లోని వ్యక్తుల జీవితాల్లో అంతరాయం కలుగుతుంది. డైనింగ్ టేబుల్‌ను ఎప్పుడూ ఇంటిలోని బీమ్ కింద పెట్టకూడదు. ఇది ప్రతికూల శక్తుల ప్రవాహాన్ని పెంచుతుంది.
డైనింగ్ టేబుల్ తగినంత వెలుతురులో ఉండేలా చూసుకోవాలి. ఇక దక్షిణం వైపు చూస్తూ భోజనం చేయకూడదు ఎందుకంటే అది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. భోజనం చేసేటప్పుడు ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోవాలి. అప్పుడే భోజనం ఆరగించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.