12 మే నుంచి 18 వ‌ర‌కు.. ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..!

చాలా మంది జ్యోతిష్యాన్ని న‌మ్ముతుంటారు. ఏ ప‌ని ప్రారంభించినా స‌రే త‌మ రాశుల ఫ‌లితాల‌ను బ‌ట్టి ప‌నుల‌ను, శుభ‌కార్యాల‌ను ప్రారంభిస్తారు మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - May 12, 2024 / 06:00 AM IST

మేషం

ఈ రాశివారికి ప్రారంభించిన ప‌నిలో ఆశించిన దాన్ని క‌న్నా ఎక్కువ ఫ‌లితాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించి శుభ‌వార్త‌లు వింటారు. కీల‌క విష‌యాల్లో పెద్ద‌ల‌ను క‌లుస్తారు. మీ ప‌నితీరుతో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటారు. ఆర్థిక విష‌యాల్లో సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితాలు ఉన్నాయి. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త‌ను వింటారు.

వృష‌భం

ఈ రాశివారికి పెద్ద‌ల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. బంధు, మిత్రుల వ‌ల్ల ధ‌న వ్య‌యం జ‌రుగుతుంది. ప్రారంభించిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కండి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు.

మిథునం

ఈ రాశివారు ఆశించిన ఫ‌లితాల కంటే మేలైన ఫ‌లితాల‌ను అందుకుంటారు. మీ మీ రంగాల్లో మీదే పై చేయి అవుతుంది. విశేష‌మైన ఆర్థిక ఫ‌లితాలు ఉన్నాయి. ఒక శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభ‌దాయ‌క‌మైన ఫ‌లితాలు ఉంటాయి. బంధుప్రీతి ఉంటుంది.

క‌ర్కాట‌కం

ఈ రాశివారు మంచి మ‌న‌సుతో ముందుకు సాగాలి. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త అవ‌స‌రం. మంచి మ‌న‌సుతో చేసే ఆలోచ‌న‌లు గొప్ప భ‌విష్య‌త్‌ను ఇస్తాయి. ధ‌న‌లాభం ఉంది. అవ‌స‌రానికి తోటి వారి స‌హాయం అందుతుంది. మ‌న‌స్ఫూర్తిగా చేసే ప‌నులు వెంట‌నే సిద్ధిస్తాయి. అప‌రిచితుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

సింహం

ఈ రాశివారు విజ‌యానికి ఆటంకం క‌ల‌గ‌కుండా చూసుకోవాలి ఆత్మ విశ్వాసం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. మ‌న‌ప‌క్క‌నే ఉండి ఇబ్బంది పెట్టే వారు ఉన్నారు. స్థిరాస్తికి సంబంధించిన విష‌యాలు అనుకూలిస్తాయి. కొన్ని సంద‌ర్భాల్లో ముక్కు సూటిత‌నంగా వ్య‌వ‌హ‌రించ‌డం మేలు. అనుభ‌వ‌జ్ఙుల స‌ల‌హాలు మేలు చేస్తాయి.

క‌న్య

ఈ రాశివారికి శ్ర‌మ ఫ‌లిస్తుంది కుటుంబ స‌భ్యుల‌కు మేలు జరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం ప‌ర్వా లేద‌నిపిస్తుంది. బంధు, మిత్రుల స‌హ‌కారం ప‌రిపూర్ణంగా ఉంది. స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌ల‌తో గొప్ప ఫ‌లితాల‌ను సాధిస్తారు. మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. కొన్నికీల‌క‌మైన ప‌నుల్లో పురోగతి ఉంటుంది.

తుల

ఈ రాశివారు విశేష‌మైన ఫ‌లితాల‌ను అందుకుంటారు. కొత్త కార్య‌క్ర‌మాలు వెంట‌నే నేర‌వేరుతాయి. ముఖ్య విష‌యాల్లో ఏకాగ్ర‌త స‌డ‌ల‌కుండా చూసుకోవాలి. బంధు, మిత్రుల ఆధారాభిమానాలు ఉంటాయి. మీ ప్ర‌తిభ‌తో తోటి వారిని ఆక‌ట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభ‌కాలం. మీ మ‌నోధైర్యంతో అసాధ్యాల‌ను సుసాధ్యం చేస్తోంది. వారాంతంలో శాంతి చేకూరుతుంది.

వృశ్చికం

ఈ రాశివారి కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. ఆశ‌య సాధ‌న‌లో స‌ఫ‌లీకృతులు అవుతారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కార‌తో నూత‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీకు ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. శుభ‌కార్యాల్లో పాల్గంటారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఒక శుభ వార్త శ‌క్తినిస్తుంది.

ధ‌న‌స్సు

ఈ రాశివారికి విజ‌య‌వ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ఆత్మ‌విశ్వాసంతో ప‌ని చేసి అనుకున్న ఫ‌లితాల‌ను సాధిస్తారు. వ్యాపారంలో మిశ్ర‌మ ఫ‌లితాలు సూచితం. స‌మాజంలో మంచి పేరు సంపాదిస్తారు. వారాంతంలో శుభ ఫ‌లితాలు ఉన్నాయి. కొత్త వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న ప‌ద్ధ‌తుల‌ను తెలుసుకుని అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగుతారు.

మ‌క‌రం

ఈ రాశివారికి గొప్ప శుభ‌కాలం న‌డుస్తోంది. కృషి ఫలిస్తుంది. మ‌నోధైర్యంతో చేసే ప‌నులు స‌త్ఫ‌లితాన్ని ఇస్తాయి. నూత‌న వ‌స్తువులు కొంటారు. ఒక వార్త మ‌నోబ‌లాన్ని పెంచుతుంది. ధ‌న లాభం ఉంది. విజ‌య అవ‌కాశాలు అధికం అవుతాయి. శ‌త్రువుల‌పై నైతిక విజ‌యాన్ని సాధిస్తారు. బాధ్య‌త‌లు పెర‌గ‌డం వ‌ల్ల సంయ‌మ‌నం పాటించాలి.

కుంభం

ఈ రాశివారికి గ‌తంతో పోలిస్తే ఈసారి మేలు జ‌రుగుతుంది. శ్ర‌మ పెరుగుతుంది. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాఇ. శ‌త్రువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. అన‌వ‌స‌ర విష‌యాల్లో త‌ల‌దూర్చ‌కండి. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు. ప‌క్కా ప్ర‌ణాళిక ద్వారా స‌త్ఫ‌లితాలు సిద్ధిస్తాయి. మిత్రుల సూచ‌న‌లు ప‌ని చేస్తాయి.

మీనం

ఈ రాశివారు నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. ఒక శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. అంద‌ర్నీ క‌లుపుకుపోతే మేలు జ‌రుగుతుంది. కీల‌క విష‌యాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. మ‌నో బ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. మాన‌సికంగా ధృఢంగా ఉంటారు. కీల‌క విస‌యాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. ఇత‌రుల వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోక‌పోవ‌డ‌మే మంచిది.