ఏ రోజు ఏ రంగు దుస్తులు ధ‌రించాలి..? అలా వ‌స్త్రాల‌ను ధ‌రిస్తే ఫ‌లితం ఉంటుందా..?

హిందూ సంప్ర‌దాయంలో రంగుల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు, పూజ‌లు చేసేట‌ప్పుడు ఆయా దేవుళ్ల‌కు ఇష్ట‌మైన రంగు వ‌స్త్రాల‌ను ధ‌రిస్తుంటాం. దాంతో ఆ దేవుడి అనుగ్ర‌హం మ‌న‌పై ఉంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది. కాబ‌ట్టి రంగుల‌కు మ‌న జీవితానికి అవినాభావ సంబంధం ఉంటుంది.

  • Publish Date - June 29, 2024 / 07:15 AM IST

హిందూ సంప్ర‌దాయంలో రంగుల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు, పూజ‌లు చేసేట‌ప్పుడు ఆయా దేవుళ్ల‌కు ఇష్ట‌మైన రంగు వ‌స్త్రాల‌ను ధ‌రిస్తుంటాం. దాంతో ఆ దేవుడి అనుగ్ర‌హం మ‌న‌పై ఉంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది. కాబ‌ట్టి రంగుల‌కు మ‌న జీవితానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం ఒక్కో రంగు ఒక్కో గ్ర‌హంతో ముడిపడి ఉంటుంది. కాబ‌ట్టి గ్ర‌హాలు మ‌న జీవితంలో సానుకూల ప్ర‌భావాలు చూపించాలంటే రోజుకో ఓ రంగు వ‌స్త్రం ధ‌రిస్తే మంచిద‌ని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఏ రోజు ఏ రంగు వ‌స్త్రం ధ‌రిస్తే మంచిదో తెలుసుకుందాం..

సోమవారం

సోమవారం అంటే చంద్రునికి ప్రతీక. కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించండి.

మంగ‌ళ‌వారం

మంగళవారం నాడు అంగారక గ్రహానికి సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి అంగారక గ్రహం యొక్క రంగులు అయిన కాషాయం, కుంకుమ రంగుల దుస్తులు ధరిస్తే మంచిది.

బుధ‌వారం

బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. ఇలా ధరించడం వల్ల మేధస్సు పెరుగుతుంది.

గురువారం

గురువారం నాడు బృహస్పతి రోజు కావడంతో పసుపురంగు దుస్తులను ధరించాలి. వాస్తుశాస్త్రం ప్రకారం పసుపు రంగు అహింస, ప్రేమ, ఆనందం, మరియు జ్ఞానానికి ప్రతీకగా పరిగణించబడుతుంది.

శుక్ర‌వారం

శుక్రవారం నాడు శుక్ర గ్రహానికి అంకితం చేయబడిన రోజు కాబట్టి ఈరోజు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి.

శ‌నివారం

ఇక శనివారం నాడు శని అనుగ్రహం ఉన్న రోజు కాబట్టి ఈరోజు నలుపు రంగు, నీలం రంగు, ముదురు గోధుమ రంగు, ముదురు ఊదా రంగు దుస్తులను ధరించాలని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఆదివారం

ఆదివారంనాడు సూర్యుడిని ప్రార్థిస్తారు. ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించండి.

Latest News