Safety Pins | హిందూ సంప్రదాయం మంగళ సూత్రానికి( Mangalasutra ) ప్రత్యేక స్థానం ఉంది. మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఏకమైన సందర్భంగా.. ప్రతి మహిళ తన మెడలో మంగళ సూత్రాన్ని ధరిస్తుంది. తన భర్త( Husband ) చేతితో కట్టించుకునే ఈ మంగళ సూత్రాన్ని భార్య( Wife ) ఎంతో పవిత్రంగా చూసుకుంటుంది. తన భర్తకు ఎలాంటి ఆటంకం కలగొద్దని, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని నిత్యం ఆ తాళిబొట్టును భర్త కళ్లకు అద్దుకుంటుంది. మరి అంతటి పవిత్రమైన ఆ పుస్తెల తాడు విషయంలో మహిళలు చిన్న పొరపాటు చేస్తుంటారు. ఆ పొరపాటు భర్త జీవితానికి ఆటంకంగా మారుతుందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ పొరపాటు ఏంటో తెలుసుకుందాం..
మన పూర్వీకులు చాలా మంది పెళ్లైన తర్వాత పసుపు తాడును మెడలో వేసుకునే వారు. మహిళలు ధరించే ఈ పసుపు తాడు పెళ్లి అయిందనడానికి ప్రతీకగా భావించేవారు. కానీ కాలక్రమేణా.. పసుపు తాడుకు బదులుగా బంగారు గొలుసును మెడలో ధరిస్తున్నారు. ఎందుకంటే పసుపు తాడు త్వరగా పాడైపోవడం, మురికిగా మారడం కారణంగా.. బంగారు గొలుసు వైపు అందరు దృష్టి సారించారు. ఇక ఇప్పుడు ఈ బంగారం గొలుసు లేనిది పెళ్లి జరగనే జరగదు.
అయితే చాలా మంది మహిళలు ఎంతో పవిత్రంగా భావించే ఈ బంగారు పుస్తెల తాడుకు.. సేఫ్టీ పిన్నులు(పిన్నిసు) పెడుతుంటారు. ఇలా సేఫ్టీ పిన్నులను( Safety Pins )పెట్టడం చాలా ప్రమాదమని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. పవిత్రమైన మంగళసూత్రానికి సేఫ్టీ పిన్నులుపెట్టడం వలన ఇది భర్త పురోగతికి అడ్డంకిగా మారుతుందంట. అదే విధంగా తన ఆదాయానికి ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు పండితులు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మహిళలు తమ మంగళసూత్రానికి సేప్టీపిన్నులు ధరించకూడదంట.
సేఫ్టీ పిన్నులతో పాటు ఇనుముతో చేసిన వేటిని కూడా తాళికి జత చేయకూదంట. ఎందుకంటే ఇనుము అనేది శని దేవుడికి సంబంధించిన లోహం. దీనిని మంగళసూత్రానికి జత చేయడం వంలన ఇంట్లో ప్రతి కూల శక్తి పెరగడమే కాకుండా, బంధంలో కూడా చీలికలు ఏర్పడే ప్రమాదం ఉన్నదని పండితులు హెచ్చరిస్తున్నారు. సో బీ కేర్ ఫుల్.