Lizards | ఇంటిలో బ‌ల్లుల పోట్లాట‌..! శుభ‌మా.. అశుభ‌మా..?

Lizards | ప్ర‌తి ఇంట్లో బ‌ల్లులు( Lizards ) ఉండ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అది కూడా ఎక్క‌డంటే అక్క‌డ బ‌ల్లులు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. అయితే ఇంట్లో( House ) బ‌ల్లులు ఉండ‌డాన్ని కొంద‌రు శుభం( Good )గా భావిస్తే, మ‌రికొంద‌రు అశుభంగా భావిస్తారు. మ‌రి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

  • Publish Date - September 17, 2025 / 05:45 AM IST

Lizards | బ‌ల్లి అంటేనే కొంత మంది మ‌హిళ‌ల‌కు గుండెలు గుభేల్ మంటాయి. దాన్ని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు త‌రిమేసే వ‌ర‌కు విశ్ర‌మించ‌రు. కొంద‌రైతే బ‌ల్లుల‌ను( Lizards ) ఏ మాత్రం ప‌ట్టించుకోరు. అయితే ఇంట్లో( House ) ఈ బ‌ల్లులు పోట్లాడుకోవ‌డం శుభ‌మా..? అశుభ‌మా..? అనే విష‌యాల‌ను ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

ఇంట్లోకి బ‌ల్లులు రావ‌డం స‌హ‌జం. కొంత మంది కొత్త ఇంటి వాస్తు పూజ‌ను వెండి బ‌ల్లి విగ్ర‌హాల‌ను ఉప‌యోగించి నిర్వ‌హిస్తారు. దీంతో ఆ ఇంట్లో సంప‌ద‌, సంతోషాన్ని పెంచుతుంద‌ని న‌మ్ముతారు. వాస్తు శాస్త్రం ప్ర‌కారం.. ఇంటి పూజ గ‌దిలో బ‌ల్లులు క‌నిపిస్తే చాలా శుభ శకునంగా భావిస్తారు. అన‌తి కాలంలోనే మీ చేతిలోకి భారీగా డ‌బ్బు రాబోతుంద‌ని సూచిస్తుంది.

ఇక కొన్ని సంద‌ర్భాల్లో రెండు బ‌ల్లులు క‌లిసి పొట్లాడుకోవ‌డం చూస్తుంటాం. వాటి శ‌బ్దానికి గుండెలు కూడా అదురుతాయి. కానీ రెండు బ‌ల్లులు క‌నిపిస్తే పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. దీనికి శుభం, అశుభం అనే తేడా ఏం ఉండ‌దు.

కానీ, రెండు బల్లులు పరస్పరం పోట్లాడుకుంటూ కనిపిస్తే మాత్రం అది అశుభానికి సంకేతం అంటున్నారు జ్యోతిష్య పండితులు. కుటుంబంలో అనారోగ్యం, గొడవలు రాబోతున్నాయని సూచిస్తుందని చెబుతున్నారు.