విధాత : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానానికి కార్తీక మాసం సందర్భంగా భారీ ఆదాయం వచ్చినట్లుగా దేవాలయ అధికారులు వెల్లడించారు. కార్తీక మాసంలో స్వామివారిని 20 లక్షల 52 వేల 54 మంది భక్తులు దర్శించుకున్నారని, రూ.17 కోట్ల 62 లక్షల 33 వేల 331 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు.
గతేడాది ఆదాయం రూ.14 కోట్ల 30 లక్షల 69 వేల 481 రూపాయల ఆదాయం వచ్చిందని, గతేడాది కంటే రూ.3 కోట్ల 31 లక్షల 63 వేల 850 ఆదాయం దేవాలయానికి అధికంగా వచ్చిందని అధికారులు తెలిపారు. అత్యధికంగా ప్రసాద విక్రయాల ద్వారా 3కోట్ల 27లక్షలు 41,215రూపాయలు, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా 2కోట్ల 52లక్షల 68వేలు, కొండపైన వాహన ప్రవేశాలతో 1కోటి 31,79,995రూపాయలు, వీఐపీ దర్శనాల ద్వారా 1కోటి 25,72,400 ఆదాయం సమకూరిందని తెలిపారు. 2024లో 23,263సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగితే..2025లో 24,447వ్రతాలు జరిగినట్లుగా తెలిపారు.
