Site icon vidhaatha

Inter Exam Fee | ఇంట‌ర్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపున‌కు చివ‌రితేదీ న‌వంబ‌ర్ 26

Inter Exam Fee | తెలంగాణ‌లోని ఇంట‌ర్ విద్యార్థుల‌కు( Inter Students ) ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు( Intermediate Board ) కీల‌క అప్డేట్ ఇచ్చింది. వార్షిక ప‌రీక్ష‌ల ఫీజుల‌కు సంబంధించిన తేదీల‌ను ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ విద్యార్థులు ఈ నెల 6వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు తాము చ‌దువుతున్న కాలేజీల్లో ఫీజు చెల్లించాలి.

ఫీజుల వివ‌రాలు ఇలా..

ఫ‌స్టియ‌ర్ జ‌న‌ర‌ల్ కోర్సుల‌కు రూ. 520
వొకేష‌న‌ల్ కోర్సుల‌కు రూ. 750
సెకండియ‌ర్ జ‌న‌ర‌ల్ ఆర్ట్స్ కోర్సుల‌కు రూ. 520
సైన్స్, వొకేష‌న‌ల్ కోర్సుల‌కు రూ. 750

ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 27 వ‌ర‌కు చెల్లించొచ్చు..

రూ. 100 ఆల‌స్య రుసుంతో న‌వంబ‌ర్ 27 నుంచి డిసెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు చెల్లించొచ్చు. రూ. 500 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 5 నుంచి 11 వ‌ర‌కు, రూ. 1000 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 12 నుంచి 18 వ‌ర‌కు, రూ. 2 వేల ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 19 నుంచి 27 వ‌ర‌కు చెల్లించే అవ‌కాశం క‌ల్పించారు.

 

Exit mobile version