విధాత, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ విద్యాసంవత్సరం ప్రధాన పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీకి 500 మార్కులు ఉండగా వీటిలో రాత పరీక్షకు 470, ప్రాక్టికల్స్ (కెమిస్ట్రీ 15, ఫిజిక్స్ 15) 30 మార్కులు ఉంటాయి. గతంలో మ్యాథ్స్ సబ్జెక్ట్‌కు రెండు పేపర్లుగా నిర్వహిస్తుండగా పేపర్-1ఏకు 75, పేపర్-1బీకి 75 మార్కులు కలిపి 150 మార్కులు ఉండేది. కాగా, ఈ ఏడాది నుంచి దీనిని కుదించి మొత్తం 100 మార్కులు ఒకే పేపరు నిర్వహించనున్నారు.
అలాగే.. ఫిజిక్స్ 85, కెమిస్ట్రీ 85, ఫస్ట్, సెకండ్ లాంగ్వేజ్‌కు 100 మార్కులు చొప్పున రెండు పరీక్ష పత్రాలు అందించనున్నారు. మ్యాథ్స్య్ 35 పాస్ మార్కులుగా నిర్ధారించారు. దీంతో పాటు బైపీసీకి 500 మార్కులు ఉండగా ఇందులో రాత పరీక్షలకు 455 మార్కులు, ప్రాక్టికల్స్ (కెమిస్ట్రీ 15, ఫిజిక్స్ 15, బోటనీ, జువాలజీ 15) 45 మార్కులు ఉంటాయి. గతంలో బోటనీ 60 మార్కు లకు, జువాలజీ 60 మార్కులుగా ఉండేవి. ఈ ఏడాది నుంచి ఈ రెండు ప్రశ్నపత్రాలను కలిపి ఒకే ప్రశ్నపత్రంగా 85 మార్కులుగా అందించనున్నారు. ఆన్సరేట్లు మాత్రం రెండుగా ఉండనున్నాయి. బోటనీ 43, జువాలజీ 42 మార్కులుగా ప్రశ్నలుంటాయి. దీనికి 29 మార్కులు వస్తే ఉత్తీర్ణతగా ప్రకటిస్తారు. ఫిజిక్స్ 85, కెమిస్ట్రీ 85 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఫస్ట్, సెకండ్ లాంగ్వేజ్‌లకు 100 మార్కుల చొప్పున పరీక్ష పత్రాలను అందించనున్నారు.
