పరీక్షా కేంద్రంలో చుట్టూ 500 మంది అమ్మాయిలు.. స్పృహ కోల్పోయిన అబ్బాయి

Viral News | పరీక్షా హాలులోకి వెళ్లిన ఓ విద్యార్థి సొమ్మసిల్లిపడిపోయాడు. అందుకు కారణం ప్రశ్నపత్రమా అంటే కాదండోయ్‌.. విద్యార్థి చుట్టూ అమ్మాయిలూ ఉండడమే. అవును మీరు చదివింది నిజమే.. పరీక్షా హాలులో అందరూ అమ్మాయిలు ఉండడంతో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లో 12వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. సుందర్‌ఘడ్‌కు చెందిన విద్యార్థి మని శంకర్‌ (17) అల్లామా ఇక్బాల్‌ కళాశాలలో చదువుతున్నాడు. పరీక్ష రాసేందుకు సుందర్‌ఘఢ్‌లోని […]

  • Publish Date - February 2, 2023 / 02:46 AM IST

Viral News | పరీక్షా హాలులోకి వెళ్లిన ఓ విద్యార్థి సొమ్మసిల్లిపడిపోయాడు. అందుకు కారణం ప్రశ్నపత్రమా అంటే కాదండోయ్‌.. విద్యార్థి చుట్టూ అమ్మాయిలూ ఉండడమే. అవును మీరు చదివింది నిజమే.. పరీక్షా హాలులో అందరూ అమ్మాయిలు ఉండడంతో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లో 12వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.

సుందర్‌ఘడ్‌కు చెందిన విద్యార్థి మని శంకర్‌ (17) అల్లామా ఇక్బాల్‌ కళాశాలలో చదువుతున్నాడు. పరీక్ష రాసేందుకు సుందర్‌ఘఢ్‌లోని బ్రిలియంట్‌ స్కూల్‌లో పరీక్ష రాసేందుకు వెళ్లాడు.పరీక్ష హాలులోకి వెళ్లిన తర్వాత ఇక్బాల్‌ చుట్టూ దాదాపు 50 మంది వరకు అమ్మాయిలు ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అతనికి జ్వరం వచ్చి, అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. పరీక్షా కేంద్రం వద్ద మనీశ్‌ శంకర్‌ తండ్రి సచ్చిదానంద్‌ ప్రసాద్‌ తీసుకెళ్లాడు.

బుధవారం షెడ్యూల్‌ ప్రకారం గణితం పరీక్ష జరగనుండగా.. మనీశ్‌ పరీక్ష రాసేందుకు హాల్‌లోకి వెళ్లాడు. పరీక్ష హాల్‌లో అందరూ బాలికలే ఉండటంతో ఆవిద్యార్థి ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయాడు. అందరూ అమ్మాలు ఉండడం, తాను ఒక్కడే అబ్బాయి కావడంతో ఆందోళనకు గురై సొమ్మసిల్లి పడిపోయాడని అతని మేనత్త తెలిపింది. అయితే, బ్రిలియంట్‌ కాన్వెంట్‌ స్కూల్‌‌పరీక్షా కేంద్రంలో 500 మందికి కంటే ఎక్కువ మంది విద్యార్థినులున్నారు.

తన మేనల్లుడికి ఆ పాఠశాలలోనే మెయిన్‌ హాల్‌లో సీటు కేటాయించారని, అక్కడ అందరూ విద్యార్థినులే ఉన్నారని, ఒకేసారి చుట్టూ అంతమంది అమ్మాయిలు ఉండేసరి తాను ఒంటరినని ఫీలై స్పృహ కోల్పోయాడని ఆమె చెప్పింది. అంత అమ్మాయిలున్న కేంద్రంలో ఒకే అబ్బాయికి పరీక్షా కేంద్రం కేటాయించడంపై బంధువులు మండిపడ్డారు.

Latest News