Pakadwa Marriage | బీహార్‌లో వెలుగులోకి పకడ్వా వివాహ్‌.. యువ‌కుడికి డ్ర‌గ్స్ ఇచ్చి మ‌రీ..

బీహార్‌ (Bihar)లో మళ్లీ బలవంతపు వివాహాలు (Pakadwa marriage) ఎక్కువయ్యాయి. తాజాగా పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ (Bihar Police Aspirant) కోసం సిద్ధ‌మ‌వుతున్న ఓ యువ‌కుడిని కిడ్నాప్ చేసి, అత‌డికి డ్ర‌గ్స్ (drugs) ఇచ్చి బ‌లంతంగా పెళ్లి చేశారు.

Pakadwa marriage

Pakadwa Marriage | బీహార్‌ (Bihar)లో మళ్లీ బలవంతపు వివాహాలు (Pakadwa marriage) ఎక్కువయ్యాయి. యువ‌కుల్ని కొంద‌రు కిడ్నాప్ చేసి వారికి బ‌లవంతంగా పెళ్లిళ్లు (Forced Marriage) చేస్తున్నారు. ఇప్ప‌టికే ఇలాంటి ఘ‌ట‌న‌లు అనేకం వెలుగు చూసిన విష‌యం తెలిసిందే. తాజాగా బీహార్ రాష్ట్రంలో మ‌రో బ‌ల‌వంతంపు పెళ్లి వైర‌ల్‌గా మారింది. ఓ యువ‌కుడికి డ్ర‌గ్స్ (drugs) ఇచ్చి మరీ ఈ ఘాతుకానికి పాల్ప‌డ‌టం సంచ‌ల‌నంగా మారింది.

కిడ్నీప్ చేసి..డ్ర‌గ్స్ ఇచ్చి..

సమస్తీపూర్ (Samastipur) జిల్లా జోడి పఖర్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ బిహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు (Bihar Police Aspirant). స్థానికంగా కోచింగ్ తీసుకుంటున్నాడు. ఫిబ్రవరి 7వ తేదీన నితీశ్ కుమార్ లైబ్రరీకి వెళుతుండగా శంకర్ రాయ్ కుటుంబ సభ్యులు అతడిని కిడ్నాప్ చేశారు. అత‌డిని దారుణంగా కొట్టి డ్ర‌గ్స్ ఇచ్చారు. అనంత‌రం పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి మోర్వాలోని ఓ ఆలయానికి తీసుకెళ్లారు. అక్క‌డ శంక‌ర్ రావు త‌న కుమార్తె ల‌క్ష్మీ కుమారికి నితీశ్‌కు ఇచ్చి బ‌లంతంగా పెళ్లి చేశారు.

వీడియో వైర‌ల్ కావ‌డంతో..

ఆ త‌ర్వాత ఓ గ‌దిలో అత‌డిని బంధించారు. అయితే, బ‌ల‌వంత‌పు పెళ్లికి సంబంధించిన వీడియో వైర‌ల్ కావ‌డంతో ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. వివాహ స‌మ‌యంలో నితీశ్ స్పృహ‌లో లేడు. పెళ్లి పీట‌ల‌పై తూలుతూనే క‌నిపించాడు. కొంద‌రు ఈ త‌తంగాన్నంతా వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో అదికాస్తా వైర‌ల్‌గా మారింది.

వీడియో చూసిన సమస్తీపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు శంకర్‌రాయ్ ఇంటికి వెళ్లారు. అక్క‌డ గ‌దిలో బంధీగా ఉన్న నితీశ్‌ను విడిపించారు. ఈ మేర‌కు బాధితుడి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అతడి ఫిర్యాదు మేర‌కు బాధ్యుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ మేర‌కు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఒక్క ఏడాదిలోనే 1224 బలవంతపు పెళ్లిళ్లు..

బీహార్ రాష్ట్రంలో ‘పకడ్వా వివాహ్‌’లు తరచుగా జరుగుతూ ఉన్నాయి. ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తున్న యువ‌కుడు, లేదా ఉన్న‌త చ‌దువులు పూర్తి చేసిన యువ‌కులే టార్గెట్‌గా వారిని కిడ్నాప్ చేసి బలవంతపు పెళ్లిళ్లు చేస్తుంటారు. అమ్మాయిల తరఫు వారు ఆయుధాలతో బెదిరించి యువకులకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. 2009 సంవత్సరంలోనే ఏకంగా 1224 బలవంతపు పెళ్లిళ్లు జరిగిన‌ట్లు ప్ర‌భుత్వ లెక్క‌లు చెబుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి :

Lok Sabha Speaker | స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. ఆ ప్ర‌క్రియ ఎలా ఉంటుందో తెలుసా.. గ‌తంలో ఎన్నిసార్లు జ‌రిగింది..?
ఇండియా-పాకిస్థాన్ బార్డర్‌లో కంచెకు సీసాలు ఎందుకు వేలాడదీస్తారో తెలుసా? దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా!

Latest News