విధాత : గోవాలోని బాగా బీచ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రపు అలలు ఉదృతంగా ఉన్న సమయంలో తీరాన రాళ్లపై కూర్చున్న ఓ వ్యక్తి అదే అలలకు బలైపోయాడు. కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాకు చెందిన సహస్ అశ్‌పాక్ మసాలి(33) పర్యాటక ప్రాంతాల సందర్శకు వచ్చి…గోవాలోని బాగా బీచ్ సముద్ర తీరంలోని రాళ్లపై కూర్చొని ఎంజాయ్ చేయబోయాడు. ఇంతలో భారీ అలలు ఒక్కసారిగా అతడిని సముద్రంలోకి లాక్కెళ్లాయి.ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు, బలమైన నీటి ప్రవాహాల మధ్య తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించినా, అతను సముద్రపు శక్తివంతమైన ప్రవాహాలకు బలైపోయాడు. అల్లకల్లోలంగా ఉన్న సముద్రం, బలమైన ప్రవాహాలు ఒక ప్రశాంత క్షణాన్ని హృదయ విదారకంగా మార్చాయి.
ఈ ఘటన సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టి గంటల తర్వాత మృతదేహాన్ని గుర్తించి తీరానికి చేర్చారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సముద్రం ఉద్ధృతంగా ఉన్న సమయంలో, ముఖ్యంగా రుతుపవనాల సమయంలో సముద్ర తీరంలో అప్రమత్తంగా ఉండాలని, రాళ్లపైకి వెళ్లొద్దని, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
கர்நாடகாவின் பிஜாபூரைச் சேர்ந்த சஹாஸ் அஷ்பக் மசாலி 33 வயது வடக்கு கோவாவில் உள்ள புகழ்பெற்ற பாகா கடற்கரையோரம் உள்ள பாறையில் அமர்ந்திருந்தபோது, திடீரென எழுந்த அலைகளினால் அடித்துச் செல்லப்பட்டு உயிரிழந்தார்.தேடுதல் மற்றும் மீட்புப் பணிக்குப்பின் அவரது உடல் மீட்கப்பட்டது. pic.twitter.com/O5zSHlCjz5
— M.M.NEWS உடனடி செய்திகள் (@rajtweets10) June 25, 2026