TG EDCET 2024 Results | నేడే తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు.. మధ్యాహ్నం 3.30 గంటలకు వెల్లడి

TG EDCET 2024 Results | రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్-2024 ఫలితాలు ఇవాళ (జూన్ 11న) వెల్లడికానున్నాయి. ఇవాళ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఫ‌లితాల‌ను వెల్లడించనున్నారు. అనంతరం ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://edcet.tsche.ac.in/ లో అందుబాటులో ఉంచనున్నారు.

  • Publish Date - June 11, 2024 / 09:24 AM IST

TG EDCET 2024 Results : రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్-2024 ఫలితాలు ఇవాళ (జూన్ 11న) వెల్లడికానున్నాయి. ఇవాళ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఫ‌లితాల‌ను వెల్లడించనున్నారు. అనంతరం ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://edcet.tsche.ac.in/ లో అందుబాటులో ఉంచనున్నారు.

ఈ ఏడాది మే 23న రెండు సెష‌న్లలో టీజీ ఎడ్‌సెట్-2024 ప్రవేశ ప‌రీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 33,879 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మొదటి సెష‌న్‌‌లో నిర్వహించిన పరీక్షకు 16,929 మందికిగానూ 14,633 మంది, రెండో సెష‌న్ 16,950 మందికిగానూ 14,830 మంది అభ్యర్థులు హాజ‌ర‌య్యారు. మొత్తం 87% హాజరు నమోదైంది.

ఈ ఏడాది నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షల నిర్వహణ బాధ్యత తీసుకుంది. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా రెండేళ్ల బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో మొత్తం 14,285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి..

  • ఫలితాల కోసం విద్యార్థులు మొదట https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • హోమ్‌పేజిలో కనిపించే ఫలితాలు/ర్యాంకు కార్డుకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్‌, హాల్‌టికెట్ నెంబర్‌, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ‘View Result/View Rank Card’ బటన్ మీద క్లిక్ చేయాలి. ప్రవేశ పరీక్ష ఫలితాలు/ర్యాంకు కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
  • అనంతరం విద్యార్థులు ఫలితాలు/ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసి భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

Latest News