Bigg Boss 9 | తుది ద‌శ‌కు బిగ్‌బాస్ తెలుగు 9 .. భారీ పారితోషికంతోనే బయటకు వచ్చిన సుమ‌న్ శెట్టి

Bigg Boss 9 | కమెడియన్ సుమన్ శెట్టి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్‌గా పాల్గొని తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమాల్లో తన కామెడీతో నవ్వులు పూయించిన సుమన్, బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అదే ఇన్నోసెంట్ నేచర్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.

Bigg Boss 9 | కమెడియన్ సుమన్ శెట్టి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్‌గా పాల్గొని తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమాల్లో తన కామెడీతో నవ్వులు పూయించిన సుమన్, బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అదే ఇన్నోసెంట్ నేచర్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇతర కంటెస్టెంట్ల మాదిరిగా గొడవలు, హడావుడి, అరుపులు లేకుండా తన ఒరిజినాలిటీని కోల్పోకుండా ఆట ఆడటం ఆయనకు ప్లస్‌గా మారింది. నిజ జీవితంలో ఎలా ఉంటాడో అలాగే ఉండటం వల్లే ప్రేక్షకుల ఆదరణ దక్కిందని విశ్లేషకులు చెబుతున్నారు.నిజాయితీ, సింప్లిసిటీ కారణంగా 14 వారాల పాటు హౌస్‌లో కొనసాగిన సుమన్ శెట్టి, టాప్ 5లో తప్పకుండా ఉంటాడనే అంచనాల మధ్యే ఎలిమినేట్ కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది.

సోషల్ మీడియాలో ‘టాప్ 5 కంటెస్టెంట్’ అంటూ ఆయనకు మద్దతుగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఆట తీరు, ప్రవర్తన బిగ్‌బాస్ షోలో అరుదైనదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, సుమన్ శెట్టి బిగ్‌బాస్ షో కోసం తీసుకున్న పారితోషికం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ పొందిన కంటెస్టెంట్లలో ఆయన ఒకరని సమాచారం. రోజుకు రూ.45 వేల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం వారానికి సుమారు రూ.3.15 లక్షలు అందుకున్నారు. మొత్తం 14 వారాల పాటు కొనసాగినందుకు సుమన్ శెట్టికి దాదాపు రూ.44 లక్షల వరకు పారితోషికం దక్కినట్టు అంచనా. టాక్సులు కట్ అయిన తర్వాత ఆయన చేతికి వచ్చే మొత్తం సుమారు రూ.38 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

ఇది బిగ్‌బాస్ విన్నర్ ప్రైజ్ మనీకి చాలా దగ్గరగా ఉండటం విశేషం. సాధారణంగా బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచిన విన్నర్‌కు రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. అయితే టాక్సులు, మధ్యలో వచ్చే సూట్‌కేస్ ఆఫర్‌ల వల్ల విన్నర్‌కు దక్కే మొత్తం తగ్గే అవకాశముంది. ఆ లెక్కన చూస్తే, సుమన్ శెట్టికి విన్నర్‌కు దక్కే మొత్తానికి సమానంగా లేదా అంతకంటే మెరుగైన పారితోషికం లభించిందని చెప్పొచ్చు.ఇక బిగ్‌బాస్ తెలుగు 9 చివరి దశకు చేరుకుంది. ఈ రోజు మరో ఎలిమినేషన్ జరగనుండటంతో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో తేలనున్నారు. ప్రస్తుతం హౌస్‌లో కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజనా, డీమన్ పవన్, భరణి ఉన్నారు. వీరిలో ఎవరు బయటకు వెళ్లనున్నారనే ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలేలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాల్సి ఉంది.

Latest News