Brahmanandam | టాలీవుడ్ విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన సినీ ప్రయాణంలో అరుదైన మైలురాయిని నమోదు చేసుకున్నారు. 1975లో విడుదలైన ‘స్వర్గం నరకం’ చిత్రంతో తెరంగేట్రం చేసిన మోహన్ బాబు, నవంబర్ 22తో సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేశారు. అప్పటి నుంచి హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఇలా అనేక పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 500కు పైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక నటన శైలితో తనకంటూ ఓ స్థానం ఏర్పర్చుకున్నారు.నటుడిగానే కాకుండా నిర్మాతగా, రాజకీయవేత్తగా, విద్యావేత్తగా కూడా మోహన్ బాబు తనదైన ముద్ర వేసుకున్నారు. తెలుగు సినీ రంగానికి చేసిన సేవలను గుర్తిస్తూ, ఆయన యాభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేయడానికి కుమారుడు మంచు విష్ణు ఆధ్వర్యంలో ‘MB50’ పేరుతో భారీగా వేడుకలు నిర్వహించారు.
సినీ, రాజకీయ ప్రముఖులతో సందడిగా MB50 వేడుక
శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌కు పలువురు ప్రముఖులు హాజరై మోహన్ బాబును సత్కరించారు. ఆయన అత్యంత సన్నిహితుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిలో రామ్ గోపాల్ వర్మ, నాని, గోపీచంద్, సందీప్ కిషన్, జయసుధ, బ్రహ్మానందం, జాకీ ష్రాఫ్, భాగ్యరాజు, శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్, శివ బాలాజీ, మధుశాలిని, అలాగే ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, టీజీ విశ్వ ప్రసాద్ తదితరులు ఉన్నారు. సెలబ్రేషన్స్ అభిమానులకు, సినీ ప్రేమికులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాయి.
దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసిన మోహన్ బాబు, ఈ సందర్భంగా అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈవెంట్‌కి వచ్చే సమయంలో ఎర్రబెల్లి.. బ్రహ్మానందంని అన్నా ఒక్క ఫొటో అంటూ ఆపే ప్రయత్నం చేశారు. అప్పుడు బ్రహ్మీ అబ్బే అనుకుంటూ ఆయన చేయిని పక్కను నెట్టి ముందుకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు.
ఫోటో కోసం అడిగిన ఎర్రబెల్లి దయాకర్.. నో చెప్పిన బ్రహ్మీ.. pic.twitter.com/oZbCrmemii
— JP_Journo (@jpjourno9) November 23, 2025
