Chiranjeevi | సంక్రాంతి 2026లో మెగా సక్సెస్ .. చిరు, అనీల్ రావిపూడి ఆనందం చూశారా..!

Chiranjeevi | సంక్రాంతి 2026 వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ తీసుకొచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి తీసిన‌ తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్, పెయిడ్ షోలలో అదిరిపోయే రెస్పాన్స్ సాధించింది. సినిమా రిలీజ్‌కు ముందే జరిగిన రాత్రి ప్రీమియర్ షోలు ప్రేక్షకులను థ్రిల్ల్ చేసింది.

Chiranjeevi | సంక్రాంతి 2026 వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ తీసుకొచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి తీసిన‌ తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్, పెయిడ్ షోలలో అదిరిపోయే రెస్పాన్స్ సాధించింది. సినిమా రిలీజ్‌కు ముందే జరిగిన రాత్రి ప్రీమియర్ షోలు ప్రేక్షకులను థ్రిల్ల్ చేసింది. సోషల్ మీడియాలో వున్న పాజిటివ్ రివ్యూలు, హ్యాష్‌ట్యాగ్ #MegaBlockbuster తో సినిమా హంగామా చేస్తోంది. ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఈ సినిమాలో చిరంజీవి, లేడీ సూపర్‌స్టార్ నయనతార జంటగా కనిపించారు. అదనంగా, విక్టరీ వెంకటేశ్ స్పెషల్ క్యారెక్టర్‌లో నటించడం సినిమా ఆకర్షణను మరింత పెంచింది. కేథరిన్, హర్షవర్ధన్ వంటి ఇతర నటీనటులు కూడా తమ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు.

సినిమా గ్రాండ్ రిలీజ్ కావడంతో అనిల్ రావిపూడి, ప్రొడ్యూసర్లు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల చిరంజీవి నివాసానికి వెళ్లి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు. కేక్ కటింగ్, ఫోటో షూట్, హ్యాండ్‌లింగ్ మోమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా పోస్టు చేసిన ప్రకటనలో “మెగా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ తో ప్రీమియర్ షోలు పూర్తి అయ్యాయి. ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మెగాస్టార్, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు” అని పేర్కొన్నారు.

ప్రేక్షకుల రివ్యూలు చూస్తే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి 2026 విజేత అని, అనిల్ రావిపూడి మరోసారి తన కామెడీ-ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మాస్టర్ స్ట్రోక్ చూపించాడని ట్రెండ్ అవుతోంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లపై కూడా ఆశలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ సంక్రాంతి పండుగలో అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోగల బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న చిరంజీవికి ఈ చిత్రం ఉప‌శ‌మ‌నం అందించింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Latest News