విధాత : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భారత మహిళా జట్టు అద్భుతం చేసింది. ఆసీస్ గడ్డపై టీమ్‌ఇండియా తొలిసారి టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 17 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది.
సిరీస్ డిసైడెడ్ గా సాగిన మూడో టీ 20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (7) త్వరగానే పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ తో కలిసి స్మృతి మంధాన రెండో వికెట్‌కు సెంచరీ (121 పరుగులు) భాగస్వామ్యం నిర్మించారు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగింది. ఆఖర్లో రిచా ఘోష్ (18: 7 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్) వేగంగా ఆడింది. స్మృతి మంధాన (82), జెమీమా రోడ్రిగ్స్ (59) హాఫ్ సెంచరీలు చేశారు. కెప్టెన్ హర్మన్ (4 బంతుల్లో 2 పరుగులు) అజేయంగా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ 2.. కిమ్ గార్త్, సోఫీ చెరో వికెట్ తీశారు.
అనంతరం 177 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 159/9 స్కోరుకే పరిమితమైంది. ఆష్లే గార్డెనర్ (57) అర్ధశతకం సాధించినా ఆ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయింది. భారత బౌలర్లలో శ్రేయాంకపాటిల్ 3, శ్రీ చరణి 3, అరుంధతి రెడ్డి 2, రేణుకా సింగ్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా స్మృతి మంధాన నిలిచింది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. రెండో టీ20లో ఆసీస్ గెలిచింది.
ఇవి కూడా చదవండి :
Weight Loss Trend In China | కొత్త ట్రెండ్.. బరువు తగ్గేందుకు ప్లాస్టిక్ కవర్లను నములుతున్న చైనీయులు
Tiger Bowing To Shiva Lingam : శివలింగానికి పెద్దపులి ప్రమాణం..వీడియో వైరల్ !
