విధాత : అడవిలోని శివలింగానికి సాలీడు, సర్పం, ఏనుగు పూజలు చేసి..అమరత్వం పొందిన ఘట్టం శ్రీకాళహస్తి క్షేత్రం మహత్యం పురాణ కథలో విన్నాం. అక్కడక్కడా తరచూ శివుడి విగ్రహాల చుట్టు..శివలింగాల చుట్టు నాగుపాముల దర్శనాల ఘటనలు చూశాం. తాజాగా ఓ అడవిలోని శివలింగం వద్ద ఓ పెద్ద పులి శిరసా ప్రమాణం వీడియో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే…మధ్యప్రదేశ్ లోని కట్ని సదర్ అడవుల్లో వెలిసిన ఓ ప్రాచీన శివలింగానికి రాత్రివేళ ఓ పెద్ద పులి తన తలను తగిలించి నమస్కరించినట్లుగా ఉన్న దృశ్యాలను స్థానిక భక్తులు రహస్యంగా రికార్డు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇది చూసిన భక్తులు మహాశివుడికి వస్త్రంగా మారిన పెద్దపులి తన దేవదేవుడి పట్ల భక్తిని చాటుకుందంటూ..ఇదంతా ఆ శివయ్య మహిమగా భావిస్తున్నారు.
📍Katni, MP: A video from the Sadar forests shows a tiger bowing its head against a sacred Shivling of Lord Shiva.
A powerful moment of nature and Sanatan faith, now going viral. pic.twitter.com/xZRfj24rdo
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 21, 2026
ఇవి కూడా చదవండి :
GOLD FIRE TIGER| పులులలో అగ్ని పులి వేరయా.. !
Madam Zeher | పగలు బ్యూటీపార్లర్‌ను నడుపుతూ.. రాత్రి డ్రగ్స్ సిండికేట్‌ను శాసిస్తోంది
