GOLD FIRE TIGER| పులులలో అగ్ని పులి వేరయా.. !

థాయ్‌లాండ్ అడవుల్లో అరుదైన 'అగ్ని పులి' ప్రత్యక్షం! బంగారు వర్ణంలో మెరిసిపోయే ఈ 'ఫైర్ టైగర్' ప్రత్యేకతలేంటో తెలుసా?

Asian Golden Cat

విధాత : ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల పులుల జాతులు మనగడ సాగిస్తుండగా..వాటిలో అరుదైన పులుల జాతుల సమాచారం తరుచూ ఆసక్తి రేపుతుంటాయి. అలాంటి అరుదైన పులులలో ఫైర్ టైగర్(అగ్ని పులి) లేదా గోల్డ్ టైగర్(బంగారు పులి) ఒకటి. దీనినే ఆసియా గోల్డెన్ క్యాట్ గా కూడా పిలుస్తారు.

అరుదుగా కనిపించే అగ్ని పులి ఉనికి ఇటీవల థాయిలాండ్ లో వెలుగు చూసింది. ఖావో లువాంగ్ నేషనల్ పార్క్ లోపల ఓ ట్రైల్ కెమెరాలో ఆసియా గోల్డెన్ క్యాట్‌గా పిలిచే పైర్‌ టైగర్‌ సంచారం అరుదైన దృశ్యాలు రికార్డయ్యాయి. అరుదైన వన్యప్రాణుల జాబితాలో ఉన్న ఈ అగ్ని పులి దట్టమైన అడవిలో నెమ్మదిగా ప్రయాణిస్తున్న దృశ్యాల 10సెకన్ల వీడియో రికార్డయ్యింది.

“అగ్ని పులి”(Fire tiger)ని థాయ్‌లాండ్‌లో ‘సూవా ఫై’ (Seui fia) అని పిలుస్తారు. ఈ జాతి పులి శాస్త్రీయ నామం కాటోపుమా టెమ్మింకి (Catopuma temminckii) . అంటే అగ్నిపులి అని అర్ధం.దీని శరీరం బంగారు రంగు కాంతిలో మెరుస్తూ ఉండటం వల్ల దీనికి బంగారు పులి, అగ్ని పులి అని పేరు వచ్చింది. అలాగే దీని వెంట్రుకలను కాల్చడం వల్ల పెద్ద పులులు దూరంగా పారిపోతాయని ఒక పురాతన నమ్మకం ఉంది. అగ్ని పులి ఆగ్నేయాసియా అడవులకు చెందిన జాతి పులి. ఇది మధ్యస్థ పరిమాణంలో,ఒంటరిగా తిరగడానికి ఇష్టపడుతుంది. పగటిపూట అరుదుగా కదులుతుంది. దాని కదలికలు రహస్యంగా నీడలా ఉంటాయని వన్యప్రాణుల నిపుణులు వెల్లడిస్తున్నారు. తరిగిపోతున్న అటవీ విస్తీర్ణం, పశువుల పరిరక్షణ చర్యలలో భాగంగా రైతుల దాడులతో అగ్ని పులులు అంతరించిపోతున్నాయి. జీవ వైవిధ్యంలో భాగంగా అగ్నిపులుల జాతులను కాపాడుకోవాలని పర్యావరణ వేత్తలు పిలుపునిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

KH x RK Glimpse | 47 ఏళ్ల తర్వాత రజినీకాంత్- కమల్ హాసన్ కలయిక.. నెల్సన్ గ్లింప్స్‌తో అంచనాలు డబుల్
Rythubadi Agri Show : అన్నదాతలను ఆకట్టుకుంటున్న రైతు బడి.. అగ్రి షో !

Latest News