KH x RK Glimpse | 47 ఏళ్ల తర్వాత రజినీకాంత్- కమల్ హాసన్ కలయిక.. నెల్సన్ గ్లింప్స్‌తో అంచనాలు డబుల్

KH x RK Glimpse | తమిళ సినీ పరిశ్రమలో అగ్రగాములైన ర‌జ‌నీకాంత్ , క‌మ‌ల్ హాస‌న్ కలిసి ఓ సినిమా చేస్తే అది ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందా అని అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 47 ఏళ్ల తర్వాత ఈ లెజెండరీ హీరోలు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

  • By: sn |    movies |    Published on : Feb 21, 2026 1:53 PM IST
KH x RK Glimpse | 47 ఏళ్ల తర్వాత రజినీకాంత్- కమల్ హాసన్ కలయిక.. నెల్సన్ గ్లింప్స్‌తో అంచనాలు డబుల్

KH x RK Glimpse | తమిళ సినీ పరిశ్రమలో అగ్రగాములైన ర‌జ‌నీకాంత్ , క‌మ‌ల్ హాస‌న్ కలిసి ఓ సినిమా చేస్తే అది ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందా అని అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 47 ఏళ్ల తర్వాత ఈ లెజెండరీ హీరోలు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను దర్శకుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ తాజాగా విడుదల చేసి ఆ ఎదురుచూపులకు తెరదించాడు.

స్వాగ్‌తో మెరిసిన ఇద్దరు దిగ్గజాలు

విడుదలైన గ్లింప్స్‌లో రజినీకాంత్, కమల్ హాసన్ తమదైన స్టైల్‌లో కనిపించి అభిమానులకు డబుల్ థ్రిల్ అందించారు. రజినీ తన ప్రత్యేకమైన మేనరిజమ్స్‌తో, కమల్ తన క్లాసిక్ ఎలిగెన్స్‌తో ఆకట్టుకున్నారు. వారి లుక్స్ నుంచి వాకింగ్ స్టైల్ వరకు ప్రతి అంశం అభిమానులను అలరించేలా రూపొందించబడింది. ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడే షాట్లు, స్టైలిష్ ఎంట్రీలు వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

నెల్సన్ ప్లానింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా

ఈ ఇద్దరు దిగ్గజాలను దర్శకుడు నెల్సన్ ఎలా హ్యాండిల్ చేస్తాడన్న సందేహాలు కొందరిలో వ్యక్తమయ్యాయి. అయితే గ్లింప్స్ వీడియో ద్వారా ఆ అనుమానాలకు ఆయన సాలిడ్ సమాధానం ఇచ్చాడని చెప్పాలి. స్టైలిష్ ప్రెజెంటేషన్, హ్యూమర్ టచ్, మాస్ అట్రాక్షన్ అన్నీ చూపిస్తూ ఈ మల్టీస్టారర్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్న సంకేతాలు ఇచ్చాడు.

అనిరుధ్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ

ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్‌లో ఆయన కూడా కనిపించడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో వీడియోకు మరింత హైప్ తీసుకొచ్చారు. రజినీ–కమల్ కాంబోకు అనిరుధ్ మ్యూజిక్ ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి ఇప్పుడు మరింత పెరిగింది. ఈ ప్రాజెక్ట్‌లో ఇద్దరు హీరోలను ఎలాంటి పాత్రల్లో చూపించబోతున్నారు? కథ ఎలా ఉండబోతోంది? మిగతా క్యాస్టింగ్‌లో ఎవరెవరు ఉంటారు? వంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. మేకర్స్ త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.

మొత్తానికి, ఈ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌తోనే సినిమా పై అంచనాలను రెట్టింపు చేశారు. 70 ఏళ్ల వయసులోనూ తమ స్టార్డమ్‌ను నిలబెట్టుకుంటూ వస్తున్న రజినీకాంత్, కమల్ హాసన్ మరోసారి కలిసి తెరపై కనిపించబోతుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వండర్స్ సృష్టించనుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.