సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి రాశీ ఖన్నాకు అరుదైన బహుమతి

రజనీకాంత్ నుంచి రాశీ ఖన్నాకు అరుదైన బహుమతి లభించింది. షూటింగ్ సెట్స్‌లో ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’ పుస్తకాన్ని స్వయంగా అందజేయగా, రాశీ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

Reported by: Tejaswini Nanna | వినోదం | Aug 01, 2026, 1:46 pm IST
Read Time: 4 mins
సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి రాశీ ఖన్నాకు అరుదైన బహుమతి

తమిళ సూపర్ స్టార్, సీనియర్ హీరో రజనీకాంత్ నుంచి హీరోయిన్ రాశీఖన్నా అరుదైన బహమతి అందుకుంది. రజనీ నుంచి తనకు అందిన బహుమతి గూర్చి రాశీ సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్టు తన ఆనందాన్ని పంచుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ చిత్రం ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ చిత్రంలో నటిస్తున్న ఆమెకు ఈ ప్రత్యేక కానుక దక్కింది.

ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఓ సారి సెట్స్ లో రజనీకాంత్‌తో గ్లామరస్ బ్యూటీ రాశీఖన్నాకు రజనీకాంత్ తో మాట్లాడే అవకాశం చిక్కింది. ఈ క్రమంలో వారి మధ్య ఆధ్యాత్మికత, జీవన విధానంపై ఆసక్తికర చర్చ సాగింది. ఆ సమయంలో ఆయన ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథం ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’ పుస్తకం గురించి ప్రస్తావించారు. తాను ఆ పుస్తకం చదవలేదని ఆమె బదులిచ్చింది. తలైవా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండు రోజుల తర్వాత షూటింగ్ సెట్స్ లో స్వయంగా ఆ పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. రజనీ నుంచి అనూహ్యంగా ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’ పుస్తకం అందుకున్న రాశీఖన్నా తనకు రజనీ సార్ నుంచి అందిన అరుదైన కానుక అంటూ పొంగిపోయారు.

ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ చిత్రంలో రాశీ ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే మంచి స్పందనను అందుకున్నాయి. రజనీకాంత్ కొత్త లుక్, కథాంశంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.