Baby Monkey Punch : పంచ్ కోతి పిల్లకు అమ్మ దొరికింది..?

జపాన్ జూలో తల్లి వదిలేసిన కోతి పిల్ల ‘పంచ్’కు మహిళా కీపర్ అమ్మ ప్రేమను పంచింది. టెడ్డీ బేర్‌తో పెరిగిన పంచ్ కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Baby Monkey Punch

విధాత : తల్లి తిరస్కరణతో..సహచర కోతి గుంపులు దూరం పెట్టడంతో అనాధగా మారిన జపాన్ కోతి పిల్ల దీనగాథ సోషల్ మీడియాను కుదిపేస్తుంది. జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో పుట్టిన మకాక్‌ జాతీ కోతి పిల్ల పంచ్ తక్కువ బరువుతో పుట్టడంతో తల్లి కోతి దాని బాగోగులు చూడకుండా వదిలేసింది. అటు సహచర కోతి గుంపు కూడా కోతి పిల్ల పంచ్ ను తమలో కలుపుకోకుండా దాడులు చేయడం మొదలుపెట్టాయి. దీంతో జూ కీపర్లు దాని సంరక్షణకు ఓ కోతి టెడ్డీ బేర్‌ బొమ్మను దానికి అందించగా.. ఆ కోతి బొమ్మనే తల్లిగా భావిస్తూ నిరంతరం దానితోనే గడుపుతుంది. బొమ్మనే అమ్మగా భావిస్తూ మాతృ ప్రేమ కోసం పరితపించిన ఈ చిట్టి కోతి పంచ్ కథ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

తాజాగా జూపార్కులోని మహిళా కీపర్ ఒకరు పంచ్ కు అమ్మ ప్రేమను పంచేందుకు ముందుకు రావడం ఇప్పుడు ఆ చిట్టి కోతి కథను మరింతగా వైరల్ చేస్తుంది. అనాధ కోతి పిల్ల పంచ్ ఒంటరి తనాన్ని పోగొట్టేందుకు జూ సిబ్బందిలోని ఓ మహిళ ఆప్యాయంగా దానిని దగ్గరకు తీసుకుంది. అసలే మాతృత్వపు సహచర్యం కోసం తపించిపోతున్న చిట్టి కోతి పిల్ల తనకు అమ్మదొరికిందన్న సంతోషంతో ఆమె చేతుల్లో కి చేరిపోయింది. ఆమె ఎదపై నిద్రిస్తూ సేద తీరుతూ కనిపించింది. ఆ మహిళ కూడా పంచ్ ను లాలిస్తూ ముద్దు చేసి నిద్ర పుచ్చే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా…నెటిజన్లు అనాధ కోతి పిల్ల పంచ్ కు అమ్మ దొరికిందంటూ అమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Toll Tax | వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్‌.. టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు బంద్..!
Gold Silver Price Today| పెరిగిన బంగారం, వెండి ధరలు

Latest News