Gold Silver Price Today| పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,910పెరిగి రూ. 1,59,280కి పెరిగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,750పెరిగి రూ. 1,46,000కు చేరింది. కిలో వెండి ధర రూ.20,000పెరిగి రూ.2,90,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Feb 21, 2026, 12:36 pm IST
Read Time: 3 mins
Gold Silver Price Today| పెరిగిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి. బులియన్ మార్కెట్ లో  24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,910 పెరిగి రూ. 1,59,280కి పెరిగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,750 పెరిగి రూ. 1,46,000కు చేరింది. కిలో వెండి ధర రూ.20,000పెరిగి రూ.2,90,000వద్ద కొనసాగుతుంది.

ట్రంప్ నిర్ణయాలతో బంగారం, వెండి ధరల్లో మార్పులు

అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ అధిక సుంకాలను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పు.. అధ్యక్షుడు ట్రంప్ తగ్గేదేలే అంటూ మరోసారి ప్రపంచ దేశాలపై 10శాతం అదనపు సుంకాల విధింపు పరిణామాలతో నెలకొన్న వాణిజ్య అస్థిరతలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో ఇరాన్ చుట్టు కొనసాగుతున్న అమెరికా సైనిక కదలికలు, దౌత్యపరమైన గడువులు వంటి అంశాలు బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడులకు మద్దతుగా మారుతున్నాయని ఆర్థిక వేత్త సుగంధ సచ్‌దేవా అభిప్రాయపడ్డారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు.. ట్రంప్ తాజా సుంకాల నిర్ణయాలు, గ్లోబల్ వాణిజ్య అనిశ్చితి అన్నీ కలసి భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని, అలాగే బంగారం, వెండి ధరల్లో పెరుగుదలకు దారితీయనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.