Samantha | నటి సమంత రూత్ ప్రభు కొత్త జీవితం ప్రారంభించిన సంగతి తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్ సమీపంలోని లింగ భైరవి దేవాలయంలో సమంత–రాజ్ నిడిమోరు దంపతులు భూత శుద్ధి పద్ధతిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుక సింపుల్‌గా, సంప్రదాయబద్ధంగా సాగింది.
ఎర్రటి బనారసీ చీరలో సమంత అందం అదిరిపోయింది
వివాహ ఫొటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎర్రటి బనారసీ చీరలో సమంత సంప్రదాయ వధువుగా మెరిసిపోగా, ఆమె మినిమల్ లుక్స్, జ్యువెలరీ, స్టైలింగ్ అన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ట్రెండింగ్‌లోకి వచ్చిన సమంత మెహందీ
సమంత చేతులపై వేసిన మెహందీ డిజైన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇది ఎంతో సింపుల్‌గా ఉన్నా అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చెన్నైకి చెందిన మెహందీ ఆర్టిస్టు అరుల్మోళి ఇళవరసు ఈ మెహందీని రూపొందించారు.మెహందీ ఆర్టిస్ట్ మాట్లాడుతూ ..“సమంత మినిమల్ హెన్నా డిజైన్‌ను కోరుకుంది. ఆమె స్టైల్‌కి తగ్గట్టే క్లాసీగా ఉండేలా డిజైన్ చేశాం” అని పేర్కొన్నారు.
సమంత చేతిపై ‘రాజ్’ పేరు… క్లాసీ టచ్
వరుడు రాజ్ నిడిమోరు పేరును సమంత హెన్నాలో చిన్నగా డిజైన్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘రాజ్’ అనే పేరు సమంత కుడి చేతి మధ్య వేలిపై చిన్నగా ఉంది. దీన్ని డిజైన్ చేయడానికి దాదాపు గంట సమయం పట్టింది” అని అరుల్మోళి తెలిపారు.హెన్నాలో వరుడు పేరు దాచడం భారతీయ సంస్కృతిలో ఒక అందమైన సంప్రదాయమని కూడా ఆమె పేర్కొన్నారు.
మెహందీ కార్యక్రమంలో సమంత ప్రవర్తన తనందరినీ ఆకట్టుకుందంటూ అరుల్మోళి చెప్పుకొచ్చారు. ఆమె చాలా సంతోషంగా, చిలిపిగా, నవ్వుతూ కనిపించింది. ఒక పెద్ద నటి అయినప్పటికీ, ఎలాంటి హడావుడి లేకుండా తన సన్నిహితుల మధ్యలో సింపుల్‌గా పెళ్లి చేసుకోవడం మమ్మల్ని ఆశ్చర్యపర్చింది. ఆమెను సంతోషంగా చూడటం మా రోజునే మార్చేసింది అని అరుల్మోళి భావోద్వేగంగా తెలిపారు. మెహందీ కార్యక్రమంలో రాజ్ కూడా సమంత పక్కనే ఉండటం ప్రత్యేకంగా కనిపించింది.
