న్యూఢిల్లీ : టాలీవుడ్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)ను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హక్కుల(personality rights violation)ను ఉల్లంఘించే విధంగా పోస్టులు పెడుతున్నారని..నా వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పవన్ తరపున సీనియరు న్యాయవాది సాయి దీపక్ పిటీషన్ వేశారు. పవన్ వ్యక్తిగత ప్రతిష్ఠ, హక్కులకు భంగం కలిగించేలా సోషల్‌మీడియా, ఇ-కామర్స్ వేదికలుగా పలు పోస్టులు వైరల్ అవుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయన తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. వారం రోజుల్లోగా ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఢిల్లీ హై కోర్టున్యాయవాదిని ఆదేశించింది. అందుకు 48 గంటల సమయం ఇచ్చింది. పవన్ హక్కులను హరించేలా ఉన్న లింక్‌లను 7 రోజుల లోపు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేసింది.
ఇప్పటికే పలువురు సినీ హీరోలు తమ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హరో నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ నటులు ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ తదితరులు, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రభృతులు వారిలో ఉన్నారు.
