Pragathi |సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన ప్రత్యేక నటనతో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న నటి ప్రగతి మహవాడి ఇప్పుడు మరో రంగంలో అదరగొట్టింది. గత కొన్నేళ్లుగా సినిమాలకు కొంత దూరంగా ఉంటూ, పూర్తిగా వెయిట్ లిఫ్టింగ్ మీద దృష్టి పెట్టిన ఆమె, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక విజయాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఆ ప్రతిభను అంతర్జాతీయ వేదిక మీద కూడా చాటేసింది.
2025 Asian Open & Masters Powerlifting Championshipలో సత్తా చాటిన ప్రగతి
ఇటీవల ముగిసిన 2025 ఏషియన్ ఓపెన్ & మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్లో ప్రగతి భారతదేశం తరపున పాల్గొని మరింత ఉన్నత స్థాయి ఫలితాలను సాధించింది.
ఆమె పాల్గొన్న ప్రధాన విభాగాలు ఇలా ఉన్నాయి:
– 84 కేజీల మెయిన్ పవర్ లిఫ్టింగ్ విభాగం
సిల్వర్ మెడల్ సాధించి దేశానికి గౌరవం తీసుకొచ్చింది.
– ఇతర విభాగాలు
డెడ్‌లిఫ్ట్ – గోల్డ్ మెడల్
బెంచ్ ప్రెస్ – సిల్వర్ మెడల్
స్క్వాడ్ – సిల్వర్ మెడల్
మొత్తం గా ఒక గోల్డ్, రెండు సిల్వర్, మరో ప్రధాన విభాగ సిల్వర్—అంటే మొత్తం నాలుగు పతకాలతో ఆమె అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఫ్యాన్స్, సెలబ్రిటీల నుంచి అభినందనలు
ప్రగతి విజయంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.సినిమాల్లో నటిస్తూ, మరోవైపు వెయిట్ లిఫ్టింగ్‌లో కెరీర్‌ను నిర్మించుకుని అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం నిజంగా ప్రేరణాత్మకమని అభిమానులు చెబుతున్నారు.ప్రగతి కూడా తన సోషల్ మీడియా ద్వారా ఈ విజయం గురించి పంచుకుంటూ, తనకు కఠినమైన శిక్షణ ఇచ్చిన మాస్టర్ ఉదయ్‌కి కృతజ్ఞతలు తెలిపింది.
సోషల్ మీడియాలో వైరల్
ప్రగతి విజయం వార్త బయటకు వచ్చాక ఆమె ఫోటోలు, వీడియోలు, లిఫ్టింగ్ క్లిప్స్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి.సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు ఆమె ధైర్యానికి, కృషికి అభినందనలు అందిస్తున్నారు.
సినిమాలు – స్పోర్ట్స్: రెండింటినీ సమానంగా..
ఇటీవల ప్రగతి నటించిన కొన్ని పాత్రలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే ఇప్పుడు ఆమె స్పోర్ట్స్ కెరీర్ పట్ల ఉన్న డెడికేషన్‌ను చూసిన అభిమానులు “ప్రగతి నిజమైన మల్టీటాలెంటెడ్ ఆర్టిస్ట్” అంటూ ప్రశంసిస్తున్నారు.ప్రగతి ఇంటర్నేషనల్ స్టేజ్‌లో పతకాలు సాధించడం ఆమె వ్యక్తిగత విజయమే కాకుండా, దేశానికి గర్వకారణం.ముందు కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
