Samantha | కృతజ్ఞతలతో 2025కి గుడ్ బై .. అన్‌సీన్ వెడ్డింగ్ పిక్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన స‌మంత‌

Samantha |స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు 2025 సంవత్సరానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. “Grateful for this year” అంటూ వివిధ సందర్భాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Samantha |స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు 2025 సంవత్సరానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. “Grateful for this year” అంటూ వివిధ సందర్భాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.మెహందీ పెట్టుకున్న ఫోటోతో తన పోస్ట్‌ను ప్రారంభించిన సమంత… చివరగా పెర్ఫ్యూమ్‌పై తన పేరు రాసి ఉన్న ఫోటోతో ముగించారు. ఈ మధ్యలో తన జీవితంలో ఈ ఏడాది చోటు చేసుకున్న ఎన్నో ముఖ్యమైన క్షణాలను అభిమానులకు చూపించారు.

ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత… ఈ సందర్భంగా ఇప్పటివరకు బయటకు రాని ఓ వెడ్డింగ్ ఫోటోను కూడా షేర్ చేశారు. ఆ ఫోటోలో రాజ్ సరదాగా ఫన్నీ ఎక్స్‌ప్రెషన్ ఇస్తుండగా, పక్కనే సమంత చిరునవ్వుతో కనిపించారు. ఇది పెళ్లిలో తీసిన ర్యాండమ్ పిక్ అని తెలుస్తోంది. ఈ ఒక్క ఫోటోతోనే నెట్టింట ఫుల్ హంగామా నెలకొంది.

ప్రొడక్షన్ డెబ్యూ నుంచి జిమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వరకూ

తన సొంత నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రం ‘శుభం’ లో చేసిన క్యామియో లుక్‌ను కూడా సమంత ఈ మెమోరీస్‌లో భాగం చేశారు. ఆ సినిమా టాప్-10లో నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా షేర్ చేసిన క్రిస్మస్ ట్రీ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ముఖ్యంగా జిమ్‌లో తాను ఎంత కష్టపడ్డారో చూపించే వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఫిట్‌నెస్ విషయంలో సమంత చూపిస్తున్న డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

రూమర్స్‌కు ఫుల్ స్టాప్

కొంతకాలంగా వినిపించిన రూమర్స్‌కు ముగింపు పలుకుతూ, రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించడం 2025లో సమంత జీవితంలో కీలక మలుపుగా మారింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్ – లింగ భైరవి దేవి సన్నిధిలో భూత శుద్ధి ఆచార పద్ధతిలో ఈ జంట చాలా సింపుల్‌గా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

“2025 నా జీవితంలో స్పెషల్ ఇయర్”

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత… 2025లో నేను వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. అది నా జీవితంలో చాలా గొప్ప విషయం. అంతేకాదు నిర్మాతగా కూడా తొలి అడుగు వేశాను. సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించి మొదటి సినిమాతోనే విజయం అందుకోవడం మరింత సంతోషాన్ని ఇచ్చింది” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

కెరీర్‌లో ఫుల్ బిజీ

కెరీర్ విషయానికి వస్తే… ఈ ఏడాది ‘శుభం’ చిత్రంలో క్యామియో రోల్‌తో సందడి చేసిన సమంత, ప్రస్తుతం రాజ్ & డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ వెబ్ సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కానుంది. అలాగే ‘మా ఇంటి బంగారం’ మూవీతో సమంత ఫుల్ బిజీగా ఉన్నారు. తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తుండగా, లీడ్ రోల్ కూడా ఆమెనే పోషిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 2026లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు సమాచారం.

Latest News