Srinivasa Mangapuram | ఘ‌ట్ట‌మ‌నేని వార‌సుడి డెబ్యూ మూవీకి టైటిల్ ఫిక్స్.. అంచ‌నాలు పెంచేసిన టైటిల్ పోస్ట‌ర్

Srinivasa Mangapuram | ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో రంగ ప్రవేశం చేస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

Srinivasa Mangapuram | ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో రంగ ప్రవేశం చేస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కొద్ది రోజులుగా మూవీకి ఇదే టైటిల్ పెడ‌తార‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌గా, ఎట్ట‌కేల‌కి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తిరుపతి నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాశా థదాని నటిస్తోంది. స్వప్న దత్, పి. కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌తోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తించింది.

పోస్టర్‌లో హీరో–హీరోయిన్ ఇద్దరూ ఒకే తుపాకీని పట్టుకుని కనిపించగా, “రెండు జీవితాలు–ఒక ప్రయాణం, రెండు చేతులు–ఒక ప్రమాణం, రెండు హృదయాలు–ఒక విధి” అనే ట్యాగ్‌లైన్ కథలోని భావోద్వేగానికి సంకేతంగా నిలిచింది. ఘట్టమనేని వారసుడిగా జయకృష్ణకు స్టైలిష్, ఇంటెన్స్ లుక్‌ను ఇస్తూ రూపొందించిన ఈ పోస్టర్, అతనికి ఇదే బెస్ట్ లాంచ్ అవుతుందన్న అంచనాలు పెంచుతోంది. ‘ఆర్‌ఎక్స్ 100’తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి, ‘మహా సముద్రం’, ‘మంగళవారం’ వంటి చిత్రాల తర్వాత నాల్గవ ప్రాజెక్ట్‌గా ‘శ్రీనివాస మంగాపురం’ను తీసుకొస్తున్నారు. ఎల్లప్పుడూ డెప్త్ ఉన్న కథలను ఎంపిక చేసే ఈ దర్శకుడు, ఈ సారి కూడా ఓ కొత్త కథా శైలిని ప్రేక్షకులకు అందించనున్నారని తెలుస్తోంది.

తిరుపతి నేపథ్యంతో ఉండే ఈ లవ్ స్టోరీపై ఇప్పటికే క్రేజ్ పెరుగుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం మరో ఆకర్షణ. జయకృష్ణ డెబ్యూట్, రాశా థదాని టాలీవుడ్ ఎంట్రీ, అజయ్ భూపతి డైరెక్షన్, తిరుపతి బ్యాక్‌డ్రాప్ ఈ అన్ని అంశాలు కలగలిపి ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాపై భారీ ఆసక్తి నెలకొల్పాయి. మ‌రోవైపు మూవీ టీంకి మ‌హేష్ బాబు స‌పోర్ట్ కూడా త‌ప్ప‌క ఉంటుంది. ఇంక అన్ని క‌లిసొస్తే సినిమా హిట్ కాకుండా ఎలా ఉంటుంది.

Latest News