Dating Rumors | సోషల్ మీడియాలో పుట్టిన ఓ అనుమానం బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌ను ట్రోలింగ్‌కు గురిచేయగా, అదే సమయంలో ఆ పుకార్లకు కేంద్రంగా మారిన యువతి కరీనా స్వయంగా స్పందించి స్పష్టత ఇచ్చింది. కార్తీక్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని, అతడితో తాను డేటింగ్ చేస్తున్నాననే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఇటీవల కార్తీక్ ఆర్యన్ షేర్ చేసిన వెకేషన్ ఫోటోలు, అదే సమయంలో కరీనా పోస్ట్ చేసిన చిత్రాల్లో కొన్ని పోలికలు కనిపించడంతో నెటిజన్లు అనవసర ఊహాగానాలకు దిగారు. ఇద్దరూ ఒకే ప్రదేశంలో ఉన్నారన్న అనుమానంతో కార్తీక్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ట్రోల్స్ వెల్లువెత్తాయి. ముఖ్యంగా కరీనా వయసు అంశం చర్చనీయాంశంగా మారడంతో ఈ వ్యవహారం మరింత సున్నితంగా మారింది.
ఈ నేపథ్యంలో కరీనా తన ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చుతూ క్లారిటీ ఇచ్చింది. “నాకు కార్తీక్ తెలియదు. నేను అతని గర్ల్‌ఫ్రెండ్ కాదు. ప్రస్తుతం నేను నా కుటుంబంతో కలిసి వెకేషన్‌లో ఉన్నాను” అని ఆమె స్పష్టంగా పేర్కొంది. దీంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పుకార్లకు తెరపడినట్టయింది. 35 ఏళ్ల కార్తీక్, 17 ఏళ్ల కరీనా గోవా వెకేషన్ ఫోటోలు వైరల్ అయ్యాక, వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలొచ్చాయి. ఇప్పుడు గోవాలో ఇద్దరూ ఒకే హోటల్‌లో బస చేశారని వార్తలు రావడంతో నెటిజన్స్ ఫైర్ అయ్యారు.
నిరాధారమైన ఊహాగానాలు సెలబ్రిటీలతో పాటు సామాన్యులనూ ఎలా ఇబ్బంది పెడతాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత జీవితంపై ఆధారంలేని ప్రచారాలు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం చర్చకు తెచ్చింది.
