Mangli Bayilone Ballipalike Song : మంగ్లీ మాస్ సాంగ్ కు..యూ ట్యూబ్ షేక్

మంగ్లీ–నాగవ్వ పాడిన ‘బాయిలోనే బల్లి పలికే’ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. మంగ్లీ స్టెప్పులు ఫోక్ బీట్‌కు నెటిజన్లు మంత్ర ముగ్ధులవుతున్నారు.

Mangli Bayilone Ballipalike Song

విధాత : తెలంగాణ సింగ‌ర్, ప్ర‌ముఖ జానపద గాయని మంగ్లీ తన కొత్త పాటతో యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. మంగ్లీ పాడిన ‘బాయిలోనే బల్లి పలికే’ అనే కొత్త పాట సోషల్ మీడియాలో దూసుకపోతుంది. ఈ పాటలో మంగ్లీతో పాటు మరో ప్రముఖ జానపద గాయని నాగవ్వ కూడా తన గళం కలిపడంతో…వారి కాంబినేషన్ పాటకు మరింత ఊపు తెచ్చింది.

ఈ పాట‌కు క‌మ‌ల్ ఎస్లావ‌త్ సాహిత్యం అందించ‌గా.. సురేష్ బోబ్బిలి సంగీతం స‌మ‌కుర్చాడు. నాగ‌వ్వ‌, మంగ్లీ క‌లిసి పాడగా..పాటలో మంగ్లీ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో వైర‌ల‌వుతున్న ఈ పాట‌కు దాము రెడ్డి ఈ పాట‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇవి కూడా చదవండి :

Bride Rides Sports Bike | పెళ్లి మండపానికి స్పోర్ట్స్ బైక్ పై వధువు..వైరల్ వీడియో
Wedding In ICU : ఐసీయూలో యువతికి తాళి కట్టిన యువకుడు

Latest News