ఐస్ క్రీమ్స్‌, చిప్స్ డ్ర‌గ్స్ వ‌లె వ్య‌స‌న‌మే!

  • Publish Date - October 19, 2023 / 06:35 AM IST
  • 14 శాతం మంది పెద్దలు వీటి ఎడిక్ట్‌
  • 36 దేశాల్లో నిర్వ‌హించిన 281
  • అధ్య‌యనంలో ఈ విష‌యం వెల్ల‌డి
  • ప్యాకెజ్డ్ ఫుడ్‌తో క్షీణిస్తున్న‌ ఆరోగ్యం
  • అయినా మానలేక‌పోతున్న జ‌నం



విధాత‌: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్ర‌జ‌లు జంక్‌ఫుడ్ వ్య‌వ‌సం బారిన ప‌డుతున్నారు. టైపాస్ కోస‌మే, స్నేహితుల‌తో స‌ర‌దాగా గ‌డిపేందుకు, తాత్కాలింగా ఆకలి తీర్చుకోవ‌డానికి ఐస్‌క్రీమ్‌లు, ఆలుగ‌డ్డ చిప్స్‌, లేస్‌, బింగో వంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్) తింటూ రోగాల‌ను కొని తెచ్చుకుంటున్నారు. వీటిని మానేయాల‌ని ప్ర‌య‌త్నించి సాధ్యంకాక‌, డ్ర‌గ్స్ వ‌లె ఎడిక్ట్ అవుతున్నారు. ఆహార నిపుణులు, పరిశోధకులు 36 దేశాల్లో నిర్వ‌హించిన 281 అధ్య‌యనంలో ఇదే విష‌యం తేలింది.


జంక్‌ఫుడ్‌ లేదా యూపీఎఫ్‌లు డ్రగ్స్ వ‌లె అనారోగ్యకరమైనవి. వీటిని తిన‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు అనేక‌ ఆరోగ్య సమస్యల బారిన ప‌డుతున్నారు. 36 దేశాల్లో 281 అధ్యయనాలపై ఇటీవల జరిపిన స‌ర్వేలో 14 శాతం మంది పెద్ద‌లు యూపీఎఫ్‌ బానిసలుగా మారిన‌ట్టు తేలింది. మన ఆహారంలో యూపీఎఫ్‌లు చాలా సాధారణంగా మారిన నేప‌థ్యంలో ఇది తీవ్రమైన సమస్య మారుతున్న‌ది.


ట‌మాట సాస్‌లు, ఐస్ క్రీమ్‌లు, బిస్కెట్లు, శీతల పానీయాలు, చక్కెర తృణధాన్యాలు వంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు ప్రీమెచురిటీ, క్యాన్సర్, మానసిక క్షోభ, అకాల మరణాలుస‌హా ఆరోగ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావాలు చూపుతాయ‌ని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఐస్ క్రీం, ఆలు చిప్స్, అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన ఆహారాల‌కు డ్రగ్స్ వలె ప్రతి 10 మందిలో 1 కంటే ఎక్కువ మందిని బానిస‌లైన‌ట్టు అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. మిచిగాన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ యాష్లే గేర్‌హార్డ్ట్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు.