Fast Foods Heart Problems | ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు ఇప్పటికే నంబర్ వన్ కిల్లర్‌గా మారాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం, వారానికి మూడుసార్లకంటే ఎక్కువ సార్లు ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్లలో హార్ట్ డిసీజ్ రిస్క్ 80% వరకు పెరుగుతోంది. బర్గర్లు, పిజ్జాలు, ఫ్రైడ్ చికెన్ వంటివి కేవలం కడుపు నింపడమే కాకుండా గుండెకు సైలెంట్ వార్ ప్రకటిస్తున్నాయన్నమాట.
ఫాస్ట్ ఫుడ్స్ ఏం చేస్తాయి?
ఫాస్ట్ ఫుడ్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక ఉప్పు, ప్రాసెస్ చేసిన షుగర్స్ రక్తనాళాలను గట్టిపడేలా చేస్తాయి. దీని వల్ల రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడి, హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెంచి, గుండె కండరాలను బలహీనపరుస్తాయి. ఒకసారి ఈ “చెయిన్ రియాక్షన్” మొదలైతే దీర్ఘకాలంలో గుండె వ్యాధులు తప్పవు.
టైం లేదంటే….
నేటి పట్టణ జీవనశైలిలో సమయం తక్కువ, ఒత్తిడి ఎక్కువ. “కుకింగ్ టైం లేదు, బర్గర్ టైం ఉంది” అన్న స్థితి. తక్కువ ధరలో ఎక్కువ రుచి ఇచ్చే ఫాస్ట్ ఫుడ్ మధ్యతరగతి వాళ్లకు బాగా దగ్గరైంది. కానీ చీప్ గా దొరుకుతుంది కదా అని స్ట్రీట్ సైడ్ అమ్మే ఫాస్ట్ ఫుడ్స్ లేదా బర్గర్ లాంటివో తింటే ఆ చీప్ ఫుడ్ కాస్తా కాస్ట్లీ ట్రీట్ మెంట్ వైపు తీసుకెళ్తుంది.
ఎందుకు అట్రాక్ట్ అవుతాం?
ఫాస్ట్ ఫుడ్ కేవలం రుచి కాదు, అది ఒక డోపమైన్ హిట్. ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనలో డోపమైన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అందువల్ల ఒకసారి తింటే మళ్లీ మళ్లీ మనసు దానివైపే లాగుతుంది. దీంతో అది “ఫుడ్ అడిక్షన్”గా మారుతుంది. క్రమంగా పదే పదే ఫాస్ట్ ఫుడ్ తినకపోతే తోచకుండా తయారవుతాం.
బ్రాడర్ ఇంపాక్ట్
WHO projections ప్రకారం, 2030 నాటికి ప్రపంచంలో ప్రతి రెండవ మరణం గుండెజబ్బుల వల్లే జరుగుతుందని అంచనా. చిన్న వయస్సులోనే పిల్లల్లో ఒబెసిటీ, హై బీపీ, డయాబెటిస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అంటే, భవిష్యత్తు జనరేషన్ ఇప్పటికే గుండె సమస్యలకు బలి అవుతోంది. ఫుడ్ కంపెనీలు “చీజ్ లవ్”, “క్రంచ్ క్రేజ్” అంటూ ఆకట్టుకుంటున్నాయి కానీ, వారి బిజినెస్ లాభం మన గుండెకు నష్టంగా మారుతోంది. కఠినమైన ఫుడ్ లేబలింగ్, ట్రాన్స్ ఫ్యాట్స్ పైన రెగ్యులేషన్లు లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ నిశ్శబ్దంగా మన గుండెను తినేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.