80 శాతం మ‌హిళ‌ల్లో ‘డి’ విట‌మిన్ లోపం..! ఆ నొప్పితో బాధ‌ప‌డుతున్నార‌ట‌..!!

  • Publish Date - April 3, 2024 / 09:31 AM IST

విట‌మిన్ డి.. శ‌రీరానికి కావాల్సిన ముఖ్య‌మైన పోష‌కం. ఈ విట‌మిన్ వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌డమే కాకుండా, దృఢంగా కూడా త‌యార‌వుతాం. ఎముక‌లు బ‌లంగా త‌యార‌వుతాయి కూడా. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు డి విట‌మిన్ చాలా ఇంపార్టెంట్. అమ్మాయిల‌ నుంచి మొద‌లుకుంటే.. గ‌ర్భిణీ స్త్రీల వ‌ర‌కు డి విట‌మిన్ చాలా అవ‌స‌రం. కానీ డి విట‌మిన్ లోపం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్న‌ట్లు ఇటీవ‌లే చేసిన అధ్యయ‌నాల్లో తేలింది. ప‌ట్ట‌ణాల్లో ఉండే 80 శాతం మ‌హిళ‌లు డి విట‌మిన్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డైంది.

క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత‌నే ఈ స‌మ‌స్య అధిక‌మైన‌ట్లు అధ్య‌య‌నాల్లో తేలింది. రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోవ‌డం, ఎముక‌లు బ‌ల‌హీనంగా మార‌డం, చిన్న పిల్ల‌ల్లో రికెట్స్ వ్యాధి సంభ‌విస్తున్న‌ట్లు వెల్ల‌డైంది. మ‌హిళ‌లు న‌డుము నొప్పితో బాధ ప‌డుతున్న‌ట్లు తేలింది. ఈ విట‌మిన్ లోపం కార‌ణంగా చాలా మంది మ‌హిళ‌ల్లో ఎముక‌లు బ‌ల‌హీనంగా మారిన‌ట్లు వైద్యులు చెప్పారు. ఇంటికే ప‌రిమితం అయ్యే గృహిణుల్లో 30 మిల్లీగ్రాముల కంటే త‌క్కువ ప‌రిమాణంలో డి విట‌మిన్ అందుతున్న‌ట్లు డాక్ట‌ర్లు పేర్కొన్నారు.

ప్ర‌తి రోజు మ‌న శ‌రీరానికి 40 శాతం డి విట‌మిన్ అవ‌స‌రం. ఈ మేర డి విట‌మిన్ అందాలంటే క‌నీసం 20 నుంచి 30 నిమిషాల పాటు శ‌రీరానికి సూర్య‌ర‌శ్మి అవ‌స‌రం అని ఆర్థోపెడిక్ డాక్ట‌ర్లు సూచిస్తున్నారు. కానీ మ‌హిళ‌లు నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంటారు. త‌ద్వారా వెన్ను నొప్పికి గుర‌వుతుంటారు. స‌రైన మోతాదులో డి విట‌మిన్ ల‌భించ‌క‌పోతే వ‌య‌సు పెరిగినా కొద్దీ ఎముకలు బలహీనపడటం, ఒళ్ళు నొప్పులు రావడం అధిక‌మ‌వుతాయి. విటమిన్-డి లోపం ఉన్నవారు మెడిసిన్ వాడుతుంటారు. అయితే డాక్టర్ల సలహా లేకుండా విటమిన్-డి ట్యాబ్లెట్లు వాడొద్దంటున్నారు నిపుణులు. ఎంత ట్యాబ్లెట్లు వాడినా..అల్టర్నేట్‌గా ఏం చర్యలు తీసుకున్న.. సూర్యరశ్మి నుంచి డైరెక్ట్ గా వచ్చేదాని కంటే మెడిసిన్ ద్వారా వచ్చే విటమిన్ వల్ల ఉపయోగం పెద్దగా ఉండదని అంటున్నారు.

Latest News