Site icon vidhaatha

Brain | సబ్బులూ, టూత్ పేస్టులతో మెదడుకు ప్రమాదమా?

Brain | అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన అధ్యయనాలు ఈ విషయాలనే నొక్కి చెబుతున్నాయి. మనం రోజువారీ అతి సాధారణంగా వాడే అనేక వస్తువులు, పదార్థాలు గురించిన ఈ అధ్యయనాలు సంచలనం కలిగిస్తున్నాయి. డియోడరెంట్లు, సబ్బులూ( Soaps ), షాంపూలలో ఉండే కొన్ని రసాయనాలు మన నాడీవ్యవస్థ( Nervous System ) పై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

హైజిన్ ఉత్పత్తులు… మెదడు

మనం ప్రతిరోజూ వినియోగించే వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తుల్లో ఉండే కొన్ని కెమికల్స్, న్యూరోడీజనరేటివ్ వ్యాధులకు (అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటివి) కారణమవుతున్నట్లు గుర్తించారు. ఆరోమాటిక్ ప్రోడక్ట్స్ అయిన కాంఫర్, మెంథాల్, యూకలిప్టస్ లాంటి పదార్థాలు న్యూరోటాక్సిక్ ప్రభావాలను కలిగివుంటాయని వరల్డ్ బ్రెయిన్ వీక్ సందర్భంగా జరిగిన పరిశోధనల్లో తేలింది. ఇలాంటి పదార్థాలు రక్తం – మెదడు అడ్డంకిని దాటి బక్కల్ మ్యూకోసా ద్వారా లివర్ మెటబాలిజమ్ ని డిస్ట్రబ్ చేస్తాయంటున్నారు బెంగుళూరులోని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీ వైస్ డీన్ డాక్టర్ థామస్ మాథ్యూ. ఈ పదార్థాలకు 24 నుంచొ 48 గంటల పాటు ఎక్స్ పోజ్ అయితే మైగ్రేన్స్, సెయిజర్స్ (ఫిట్స్), ఇతర న్యూరో సైకియాట్రిక్ డిజార్డర్లు రావచ్చంటున్నారాయన.

టూత్ పేస్టుతో తలనొప్పి?

అకారణ తలనొప్పులు, ఫిట్స్, యాంగ్జయిటీ, డిప్రెషన్ లాంటివి వచ్చినప్పుడు సింపుల్ గా వాళ్ల టూత్ పేస్టు తీసేయడమో, వాడే బామ్స్ మార్చడమో చేస్తే ఫలితం ఉంటుందంటున్నారు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ ట్రస్టీ పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ మేశ్రమ్. ఇది అలర్జీ కాదు గానీ టూత్ పేస్టు తీసేయగానే క్లస్టర్ హెడేక్స్, తలనొప్పి, యాంగ్జయిటీ, అగ్రెషన్, హైపర్ యాక్టివిటీ తగ్గినట్టు ఈ అధ్యయనాల్లో గుర్తించామని చెబుతున్నారు. ప్రతి ఒక్కరిలోనూ ఈ ప్రభావాలు కనిపించకపోయినప్పటికీ ఈ పదార్థాల ప్రభావం మెదడు మీద ఉంటుందంటున్నారు.

ఈ ఉత్పత్తులలో ఉండే ఫ్తాలేట్స్, పారబిన్స్, ట్రైక్లోసన్ వంటి పదార్థాలు ఎండోక్రైన్ డిస్రప్టర్లు గా వ్యవహరిస్తాయి. ఇవి హార్మోన్‌ల పనితీరును మారుస్తూ, మెదడు కణాల పెరుగుదల, రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలికంగా వీటి వినియోగం నాడీ వ్యాధులకు దారితీయవచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఏం చేయాలి?

ఈ రసాయనాలు లేని ప్రకృతిసిద్ధ ఉత్పత్తులను ఎంచుకోవాలి. మరీ సువాసనలు లేని, పారబిన్స్ లేని, ఫ్తాలేట్స్ లేని వాటిని లేబుల్స్ చూసి కొనుగోలు చేయడం మంచిది. అధిక పరిమళం ఉండే ఉత్పత్తులను మినహాయించడం మేలు. ఒకవేళ వాడినా వాటివల్ల పైన చెప్పిన లక్షణాలేమైనా కనిపిస్తే ఆపివేయాలి.

 

Exit mobile version