Site icon vidhaatha

Garlic Benefits | ‘వెల్లుల్లి’ ఆరోగ్య వ‌ర ప్ర‌దాయిని.. రోజుకు ఒక‌టి తింటే బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలు..!

Garlic Benefits | వెల్లుల్లి( Garlic ).. ఈ పేరు విన‌గానే చాలా మందికి తాళింపు గుర్తుకు వ‌స్తుంది. ప్ర‌తి వంట‌కం( Dish )లో వెల్లుల్లి( Garlic )ని వినియోగిస్తారు. వంటింట్లో ల‌భ్య‌మ‌య్యే వెల్లుల్లిని ఆరోగ్య వ‌ర ప్ర‌దాయినిగా భావిస్తారు. చాలా మంది ప‌చ్చి వెల్లుల్లిని తినేస్తుంటారు. లేదంటే తాళింపులో వేసిన వెల్లుల్లిని కూడా ఇష్టంగా తింటారు. వెల్లుల్లి వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు( Health Benefits ) ఉన్నాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉద‌యాన్నే ప‌చ్చి వెల్లుల్లి( Garlic Benefits ) తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మంచిద‌ని సూచిస్తున్నారు. మ‌రి వెల్లుల్లి వ‌ల్ల క‌లిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

గుండె ఆరోగ్యం మెరుగు

ప్ర‌తి ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఒక ప‌చ్చి వెల్లుల్లి తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగ‌వుతుంది. బీపీని కంట్రోల్ చేయ‌డంతో పాటు శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది. దీంతో ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగవుతుంది. త‌ద్వారా గుండె స‌మ‌స్య‌లు, గుండె నొప్పి రాకుండా ఉంటుంది.

టైప్ 2 డ‌యాబెటిస్ వారికి బెట‌ర్

ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిని డ‌యాబెటిస్ వెంటాడుతుంది. అదే షుగ‌ర్ వ్యాధి. ఇలా షుగ‌ర్‌తో బాధ‌ప‌డేవారు వెల్లుల్లిని త‌మ మెనూలో భాగం చేసుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్​తో ఇబ్బంది పడేవారు దీనిని రెగ్యులర్​గా తీసుకుంటే మంచి ఫలితాలు చూడొచ్చు.

బ‌రువు త‌గ్గేందుకు..

చాలా మంది ఊబ‌కాయంతో బాధ‌ప‌డుతూ ఉంటారు. బ‌రువు త‌గ్గేందుకు ఎన్నో ర‌కాల క‌స‌ర‌త్తులు చేస్తుంటారు. బరువు తగ్గాలనుకునేవారు వెల్లుల్లిని తమ డైట్​లో చేర్చుకోవచ్చు. ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది. మెటబాలీజంను పెంచుతుంది. ఫ్యాట్​ స్టోరేజ్‌ తగ్గించి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

మెద‌డు ఆరోగ్యం మెరుగు

త‌మ జీవ‌నం సాఫీగా సాగిపోవాలంటే మెద‌డు స‌క్ర‌మంగా ప‌ని చేయాలి. అంటే మెద‌డును ఒత్తిడికి గురి చేయొద్దు. కాబ‌ట్టి వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు మెద‌డులో ఒత్తిడిని త‌గ్గిస్తాయి. న్యూరో స‌మ‌స్య‌ల‌ను కూడా ద‌రి చేరనీయ‌దు వెల్లుల్లి. అల్జీమర్స్, డిమెన్షియా వంటి మెదడు సమస్యలకు రాకుండా అడ్డుకోవడంలో హెల్ప్ చేస్తాయి.

రోగ నిరోధకశక్తి

వెల్లుల్లిలో అల్లెసిన్ ఉంటుంది. దీనిలోని యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. అందుకే వెల్లుల్లిని రెగ్యులర్​గా తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సీజనల్ సమస్యలు దూరమవుతాయి.

 

Exit mobile version