Garlic Benefits | చుంకీపాండే.. 90ల యువతకి సుపరిచితమైన పేరు. ప్రతిరోజూ పొద్దున్నే వెల్లుల్లి తినకుండా రోజు నడవదట చుంకీకి. మన రక్తం బాగుండటానికి, రక్తనాళాలలో క్లాట్స్ నివారణకు, గుండెపోటు రాకుండా ఉండటానికి ప్రతిరోజూ పరగడపున వెల్లుల్లి తినడం మంచిదని ఆయన సూచిస్తున్నారు. పొద్దున రెండు వెల్లుల్లి రెబ్బలు తినకపోతే ఇంకా నేను మేలుకోలేదేమో అనిపిస్తుంది. నేను విదేశాల్లో ఉన్నప్పుడు చాలాసార్లు వెల్లుల్లి తినలేకపోయాను. అప్పుడు నేనెక్కడో తప్పిపోయాననిపించింది. నేను రెండు వెల్లుల్లి రెబ్బలతో ప్రేమలో ఉన్నాను. అందుకే ఉదయం పూట నాతో మాట్లాడకు. నా శ్వాస చాలా చెడ్డది.. అంటూ ఆయన తన ఇన్ స్టా లో పంచుకున్నారు.
ప్రతి ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం అదనపు ఆహార ప్రయోజనాన్ని ఇస్తుందంటున్నారు వైద్యులు. “వెల్లుల్లిలో అల్లిసిన్, సల్ఫర్, యాంటీఆక్సిడెంట్ల వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుందని, ధమనులలో ప్లేక్స్ ఏర్పడకుండా నిరోధించడం ద్వారా మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాల్లో కూడా రుజువైందంటున్నారు న్యూట్రిషనిస్టులు.
వెల్లుల్లి సహజ యాంటీమైక్రోబియల్, యాంటీవైరల్ లక్షణాలను కూడా కలిగి ఉంది. రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్లను ఎదుర్కొంటుంది. దాని వాసోడైలేటరీ ప్రభావాల కారణంగా, వెల్లుల్లి వినియోగం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో పాత్ర పోషిస్తాయి, క్యాన్సర్, న్యూరోడిజెనరేటివ్ పరిస్థితుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి.
“ఇది కొలెస్ట్రాల్‌ను మేనేజ్ చేయడానికి, రక్తపోటును నియంత్రించడానికి, కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది కాబట్టి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని సల్ఫర్ సమ్మేళనాలు శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి.
వెల్లుల్లిని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యం, ఉబ్బరం లేదా దుర్వాసన వంటి దుష్ప్రభావాలు ఏర్పడవచ్చు. “యాంటీ కోయాగ్యులెంట్ మందులు వాడే వ్యక్తులు వెల్లుల్లిని అధికంగా తీసుకోవడం మానుకోవాలి ఎందుకంటే దాని రక్తాన్ని పలుచబరిచే లక్షణాలు రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేగాక, అల్సర్లు, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవాళ్లలో ఇరిటేషన్ కలింగించవచ్చు.
వెల్లుల్లిని ఒక్కదాన్నే తినేకంటే దాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం అన్ని రకాలుగా మంచిదంటున్నారు వైద్య నిపుణులు.