Health Tips | కసరత్తుల వేళ ఏదిపడితే అది తింటున్నారా.. ప్రమాదం కొనితెచ్చుకుంటున్నట్టే..!

Health Tips : ఈ రోజుల్లో ఆరోగ్యంపై అందరికీ అవగాహన పెరిగింది. ముఖ్యంగా కూర్చుని ఉద్యోగాలు చేసేవారు అనారోగ్యాల‌కు గురికాకుండా ముందు జాగ్రత్తతో వ్యాయామాలు చేస్తున్నారు. అయితే కేవ‌లం వ్యాయామం చేయ‌గానే స‌రిపోద‌ని, వ్యాయామానికి ముందు, త‌ర్వాత తీసుకోవాల్సిన ఆహార నియ‌మాల‌ను కూడా పాటిస్తేనే మంచి ఫ‌లితం ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  • Publish Date - April 15, 2024 / 07:05 AM IST

Health Tips : ఈ రోజుల్లో ఆరోగ్యంపై అందరికీ అవగాహన పెరిగింది. ముఖ్యంగా కూర్చుని ఉద్యోగాలు చేసేవారు అనారోగ్యాల‌కు గురికాకుండా ముందు జాగ్రత్తతో వ్యాయామాలు చేస్తున్నారు. అయితే కేవ‌లం వ్యాయామం చేయ‌గానే స‌రిపోద‌ని, వ్యాయామానికి ముందు, త‌ర్వాత తీసుకోవాల్సిన ఆహార నియ‌మాల‌ను కూడా పాటిస్తేనే మంచి ఫ‌లితం ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏది పడితే అది తిని వ్యాయాయం చేస్తే ప్రమాద‌క‌రమని హెచ్చరిస్తున్నారు. కాబ‌ట్టి వ్యాయామానికి ముందు, త‌ర్వాత పాటించాల్సిన ఆహార నియామాల‌పై ప్రతి ఒక్కరూ అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అస‌వ‌రం ఉంది. మ‌రి ఆ నియ‌మాలేంటో తెలుసుకుందాం..

నియమాలు..

1. వ్యాయామం చేయడానికి ముందు ప్రొటీన్‌లు ఎక్కువ‌గా ఉండే ఆహారం తీసుకోవాలి. అయితే ఏదైనా ఆహారంగా తీసుకున్న త‌ర్వాత వ్యాయామం మొద‌లుపెట్టడానికి క‌నీసం గంట‌సేపైనా విరామం ఇవ్వాలి. లేదంటే అన‌వ‌స‌ర స‌మ‌స్యలు వ‌స్తాయి. వ్యాయామానికి ముందు తీసుకునే ఆహారం కొవ్వులు, పిండి పదార్థాల మిశ్రమంగా ఉండాలి. అరటిపండు, ఉడికించిన గుడ్లు తీసుకుంటే మంచిది.

2. అదేవిధంగా వ్యాయామం తర్వాత కూడా శరీరానికి శక్తి కావాలి. అందుకే వ్యాయామం అయిన తర్వాత గంటలోపు మీకిష్టమైన పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయమం తర్వాత శరీరం అలసిపోతుంది కాబట్టి శక్తి ఎంతో అవసరం. కసరత్తుల వల్ల ఖర్చైపోయిన ఎనర్జీని పొందడానికి వోట్ మీల్, క్వినోవా, గుడ్లు, గ్రీక్ కర్డ్, చికెన్, చేపలు, గింజలు, మొలకెత్తిన విత్తనాల వంటివి తీసుకోవాలి.

3. వ్యాయామానికి ముందు, తర్వాత కూడా మంచి నీళ్లు తాగొచ్చు. అంతేకాదు రోజులో ప్రతి అరగంటకు ఒకసారి ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం.

4. బ‌రువులు లేప‌డం లాంటి ఎక్కువ కేలరీలు ఖర్చయ్యే వ్యాయామాలు చేసిన‌ప్పుడు తక్కువ కొవ్వు ఉన్న పెరుగు, ఎండు ద్రాక్ష, అరటిపండు లాంటివి తీసుకోవాలి.

5. ఇక వ్యాయామానికి ముందుగానీ, తర్వాతగానీ కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకోకూడ‌దు. నిల్వ ఉంచిన ఆహార ప‌దార్థాల‌ను అస్సలు తినకూడదు. ఎందుకంటే అవి జీర్ణం కావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది.

Latest News