విధాత, హైదారాబాద్ : రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న తెలంగాల రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో తొలి రోజు పెట్టుబడులపై కీలక ప్రకటనలు వెలువడటం ప్రభుత్వానికి కొత్త ఉత్సాహాన్ని అందించింది.
ఫ్యూచర్ సిటీలో 10 సంవత్సరాల కాలంలో 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నామని ట్రంప్ మీడియా,టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ తెలిపారు. అపోలో గ్రూప్‌కు చెందిన శోభన కామినేని తెలంగాణలో రెండు సంవత్సరాలలో రూ. 1700 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.
అలాగు తెలంగాణలో 3 సంవత్సరాలలో ఇప్పటికే తమ సంస్థ రూ.10వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదాని కుమారుడు ఏపీ ఎస్ఈజడ్(APSEZ) ఎండీ కరణ్ ఆదానీ గుర్తు చేశారు. కొత్తగా తెలంగాణలో రూ.25వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా యూఏవీ టెక్నాలజీ హైదరాబాద్‌లో రూపొందిస్తున్నామని చెప్పారు. వీటిని సైన్యానికి అందిస్తామన్నారు. ఈ యూఏవీలను ప్రపంచ మార్కెట్‌లోనూ విక్రయించనున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Revanth Reddy : తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధిస్తాంTelangana Global Summit : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ నాగార్జున సాగర్
