Health tips | బొర్రతో ఇబ్బందిగా ఉందా.. రాత్రివేళ వీటిని నానబెట్టి ఉదయాన్నే నీళ్లను తాగండి..!

Health tips : ఆహారపు అలవాట్లు, కూర్చుని పనిచేసే ఉద్యోగాల కారణంగా ఈ మధ్య చాలామందికి బొర్రలు (లావు పొట్ట) వస్తున్నాయి. అయితే ఈ బొర్రతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువసేపు నడిచినా, ఏదన్నా పనిచేసినా ఆయాసం వస్తుంది. ఆఖరికి బాత్రూమ్‌లో కూడా రెండు నిమిషాలు కుదురుగా కూర్చోలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాళ్లు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా లావుపొట్టను తగ్గించుకోవచ్చు.

  • Publish Date - June 14, 2024 / 07:05 PM IST

Health tips : ఆహారపు అలవాట్లు, కూర్చుని పనిచేసే ఉద్యోగాల కారణంగా ఈ మధ్య చాలామందికి బొర్రలు (లావు పొట్ట) వస్తున్నాయి. అయితే ఈ బొర్రతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువసేపు నడిచినా, ఏదన్నా పనిచేసినా ఆయాసం వస్తుంది. ఆఖరికి బాత్రూమ్‌లో కూడా రెండు నిమిషాలు కుదురుగా కూర్చోలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాళ్లు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా లావుపొట్టను తగ్గించుకోవచ్చు. కొన్ని ఔషధ గుణాలున్న పదార్థాలను రాత్రిపూట నీళ్లలో నానబెట్టుకుని, ఉదయాన్నే ఆ నీళ్లు తాగితే బొర్ర తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది. ఆ పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం..

1. లెమన్ వాటర్‌

నిమ్మకాయ ముక్కలు నానబెట్టిన నీరు బొర్ర తగ్గడానికి, బరువు తగ్గడానికి సాయపడుతుంది. ఈ నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నిర్విషీకరణ ప్రక్రియను ప్రోత్సహిస్తాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి. రాత్రి పడుకునే ముందు ఒక గాజు పాత్రలో నీళ్లు నింపి అందులో నిమ్మకాయ ముక్కలు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీళ్లను తాగాలి.

2. దోసకాయ నీళ్లు

దోసకాయలో ఫైబర్‌ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దోసకాయ ముక్కలను నానబెట్టిన నీళ్లు తాగడంవల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండుగా ఉన్న భావన కలిగిస్తుంది. దాంతో క్యాలరీలు కరిగిపోయి బొర్ర తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక గాజు పాత్రలో నీళ్లు పోసి, వాటిలో దోసకాయ ముక్కలు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీళ్లను తాగాలి.

3. జింజర్ వాటర్‌

అల్లం శక్తిమంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ జింజర్ వాటర్ తాగడంవల్ల బరువు తగ్గుతారు. ఈ నీళ్లను సిద్ధం చేయడానికి, రాత్రి పడుకునే ముందు నీటిలో అల్లం గ్రైండ్ చేసి వేసుకోవాలి. రాత్రంతా అల్లం నానిన నీళ్లను మరుసటి రోజు ఉదయాన్నే తాగాలి. ఈ నీటిని తాగడంవల్ల శరీరంలో మెటబాలిజం పెరిగి, కొవ్వులు కరిగిపోతాయి. ఆకలి తగ్గుడంతోపాటు బొర్ర తగ్గిపోతుంది.

4. పుదీనా నీళ్లు

పుదీనా నీళ్లు శరీరాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఒంట్లో కొవ్వు కరిగి పొట్ట తగ్గడానికి, బరువు తగ్గడానికి సాయపడుతాయి. పడుకునే ముందు ఒక గాజు పాత్రలో కొన్ని పుదీనా ఆకులు వేసి, నీటితో నింపి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీళ్లను తాగాలి.

5. యాపిల్ బెరడు నీళ్లు

యాపిల్ బెరడు నీళ్లు మంచి రుచిగా ఉంటాయి. పైగా త్వరగా బొర్ర తగ్గడానికి, బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతాయి. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని మెటబాలిజమ్‌ను మెరుగుపర్చి, రక్తంలో చక్కెర స్థాయిలను మెయింటెయిన్‌ చేయడానికి సాయపడతాయి. ఒక గాజు పాత్రలో నీటిని నింపాలి. ఆ నీళ్లలో యాపిల్‌ బెరడు ముక్కలు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీళ్లను తాగాలి.

Latest News