Lady Finger | బెండకాయ( Lady Finger ).. ఈ వెజిటబుల్( Vegetable )ను అందరూ ఇష్టపడుతారు. చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు అందరూ ఇష్టంగా తింటారు. బెండకాయతో ఎన్నో వెరైటీ వంటకాలను తయారు చేయొచ్చు. బెండకాయ ఫ్రై( Lady Finger Fry ), కర్రీ, పులుసు, పచ్చడి ఇలా నచ్చిన రీతిలో చేసుకుని తింటుంటారు. బెండకాయ తింటే తెలివి వస్తుందని అంటుంటారు. దీంతో పిల్లలు బెండకాయ కర్రీని తినేందుకు బాగా ఇష్టపడుతుంటారు. బెండకాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ఆరోగ్య ప్రయోజనాలు( Health Benefits ) ఏంటో తెలుసుకుందాం..
ఇప్పటికీ చాలా మంది బెండకాయ( Lady Finger )ను తమ పెరట్లో, పొలాల్లో పండిస్తుంటారు. లేత బెండకాయలను అలా నమిలి మింగుతుంటారు. అంటే ఎలాంటి వంటకం చేయకుండానే బెండకాయలను ఆరగిస్తుంటారు. ఎందుకంటే బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి. డయాబెటిస్( Diabetes ).. అదే షుగర్( Sugar ) వ్యాధితో బాధపడే వారికి బెండకాయ ఎంతో ఉపయోగపడుతుందని, చక్కెర స్థాయిలను( Sugar Levels ) అదుపులో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతున్నారు. బెండకాయలోని ఇథనాలిక్(Ethanolic )తో పాటు ఓక్రా మ్యుసిలెజ్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి, సదరు రోగిని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్‌ను అదుపులో ఉంచడమే కాదు.. బరువు( Weight )ను కూడా అదుపులో ఉంచుతుందట బెండకాయ. దీనిలో ఫైబర్ అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అలాగే అధికంగా తినాలనే కోరికను అదుపులో ఉంచుతుందని, ఫలితంగా బరువు తగ్గొచ్చని అంటున్నారు. అలాగే బెండకాయలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుందని వివరిస్తున్నారు. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం వల్ల ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు మద్దతు ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక బెండకాయలో విటమిన్ సి, కె, మెగ్నీషియం, ఫోలెట్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తి పెరుగుదలకు, విటమిన్ కె ఎముకలు ధృడంగా ఉండేందుకు సహాయపడతాయి. బెండకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.