Site icon vidhaatha

సైబర్‌ దాడి ఏయిమ్స్‌కే పరిమితమా?

విధాత: ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక వైద్య, పరిశోధనా సంస్థ ఏయిమ్స్‌ (AIIMS)పై సైబర్‌ దాడితో దేశం ఉలిక్కి పడుతున్నది. దీనిలో విదేశీ హస్తం ఉన్నదన్న అనుమానాలు రేకెత్తటంతో మరిన్ని భయాలు అలుము కున్నాయి. దేశానికే తలమానికమైన హాస్పిటల్‌పై జరిగిన ఈ సైబర్‌ దాడి దుష్ట శక్తులు ఓ ట్రయల్‌ రన్‌ గానే చేశాయా అనే అనుమానాలున్నాయి.

ఏయిమ్స్‌ ప్రధాన సర్వర్ హ్యాక్‌కు గురై వారం రోజులు గడుస్తున్నా దాన్నిసవరించలేక పోవటం సైబర్‌ నేరగాళ్ల శక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వారం రోజులుగా ఏయిమ్స్‌లో పనులన్నీ మాన్యువల్‌గానే జరుగుతున్నాయి. దీంతో రోగ నిర్ధారణ పరీక్షలు, వాటికి సంబంధించిన రిపోర్టులకు తీవ్ర ఆలస్యం అవుతున్నది. రోగులు కూడా గంటల తరబడి లైన్లలో నిలబడాల్సిన వస్తున్నది.

ఏయిమ్స్‌పై సైబర్‌ దాడితో వైద్య సేవలకు ఇబ్బంది ఏర్పడి రోగులు కష్టాలు పడుతున్నారు. అయితే సున్నితమైన విమానయానం, రక్షణరంగం, విదేశీ వ్యవహరాలు, బ్యాంకింగ్‌ రంగం లాంటి వాటిపై ఇలాంటి సైబర్‌ దాడి జరిగితే పరిణామాలెలా ఉంటాయో ఊహించుకుంటేనే భయమేస్తుంది.

టెక్నాలజీలో ప్రపచంలోనే అగ్రభాగాన ఉన్నామని చెప్పుకొంటున్న మనం ఏయిమ్స్‌ దాడిని గుణపాఠంగా తీసుకోవాలి. సైబర్‌ దాడులను తిప్పికొట్టేలా చర్యలు చేపట్టాలి. ఈ దాడులు ఏయిమ్స్‌కే ప‌రిమిత‌మా అనే అనుమ‌నాలు తలెత్తున్నాయి.

Exit mobile version